భర్తకు విడాకులు.. కొడుకుతో వివాహం!
దిశ, వెబ్‌డెస్క్: రష్యాలో జరిగిన ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్తకు విడాకులు ఇచ్చిన భార్య.. అతడి కొడుకునే వివాహం చేసుకొని అదే ఇంటికి కోడలిగా వచ్చింది. ఈ ఉహించని దృశ్యాన్ని చవిచూసిన భర్త షాక్‌కు గురైయ్యాడు. వివరాళ్లోకి వెళితే.. రష్యాకు చెందిన మరీనా (35). సరిగ్గా 10 ఏండ్ల కిందట అర్రే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కాగా, అప్పటికే అర్రేకు వివాహం అయి పది ఏండ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే, ఇదే […]
దిశ, వెబ్‌డెస్క్: రష్యాలో జరిగిన ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్తకు విడాకులు ఇచ్చిన భార్య.. అతడి కొడుకునే వివాహం చేసుకొని అదే ఇంటికి కోడలిగా వచ్చింది. ఈ ఉహించని దృశ్యాన్ని చవిచూసిన భర్త షాక్‌కు గురైయ్యాడు.
వివరాళ్లోకి వెళితే.. రష్యాకు చెందిన మరీనా (35). సరిగ్గా 10 ఏండ్ల కిందట అర్రే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కాగా, అప్పటికే అర్రేకు వివాహం అయి పది ఏండ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే, ఇదే సమయంలో పినతల్లి మరీనాకు వ్లాదిమిర్ మరింత దగ్గరయ్యాడు. అతడి వయస్సు పెరిగే కొద్ది మరీనా మీద ప్రేమ పెంచుకున్నాడు.
అటు మరీనా కూడా వ్లాదిమిర్‌పై అతడి కంటే ఎక్కువగా ఆసక్తి చూపింది. తమది తల్లి బిడ్డల బంధం కాదని.. ప్రేమికుల బంధం అంటూ ఇద్దరు నిర్ణయానికి వచ్చారు. దీంతో వివాహం చేసుకునేందుకు అంగీకరించుకున్నారు. ఆ తర్వాత అర్రేకు విడాకులు ఇచ్చిన మరీనా.. వెంటనే వ్లాదిమిర్‌ను వివాహం చేసుకుంది. తనకు విడాకులు ఇచ్చిన భార్య.. కొడుకుని వివాహం చేసుకొని తనకు కోడలిగా రావడంతో అర్రే మతిపోయినంత పని అయింది. వారిద్దరి జంటను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆ తర్వాత చేసేదేమి లేక సర్దుకు పోయాడు.