కొడుకు ప్రేమ వ్యవహారం.. వారి వేధింపులు భరించలేక తండ్రి ఆత్మహత్య
దిశ, మునుగోడు: కొడుకు ప్రేమ వ్యవహారం తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దండు సోమయ్య(45) చిన్న కుమారుడు అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఇరువురు పారిపోయారు. దీంతో అమ్మాయి బంధువులు అబ్బాయి తండ్రి సోమయ్యను చంపుతామని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి మునుగోడు నుండి […]
దిశ, మునుగోడు: కొడుకు ప్రేమ వ్యవహారం తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దండు సోమయ్య(45) చిన్న కుమారుడు అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఇరువురు పారిపోయారు. దీంతో అమ్మాయి బంధువులు అబ్బాయి తండ్రి సోమయ్యను చంపుతామని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి మునుగోడు నుండి కొరటికల్కు వస్తుండగా అమ్మాయి బంధువులు కొందరితో వచ్చి సోమయ్యను అడ్డగించి చంపుతామని బెదిరించినట్లు తెలుస్తోంది.
‘‘మా అమ్మాయిని అప్పగించకపోతే 20 లక్షలు ఖర్చైనా సరే మీ కుటుంబాన్ని అంతం చేస్తా. దళిత కుటుంబానికి చెందిన నీ కుమారునికి ఎక్కువ కులానికి చెందిన మా అమ్మాయి కావాల్సి వచ్చిందా? అని బండ బూతులు తిడుతూ, భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో సోమయ్య చేసేదేంలేక తన భార్యతో చెప్పుకొని మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన చుట్టుపక్కల వారు చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి వివరాలను తెలుసుకున్నారు. మృతుడి భార్య దండు ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మునుగోడు ఎస్ఐ రజనీకర్ రెడ్డి తెలిపారు.