మామను చంపిన అల్లుడు
దిశ, నల్లగొండ: కూతురు అల్లుడికి మధ్య తరచూ గొడవలు అవుతున్నాయని.. సర్దిచెప్పడానికి వచ్చిన తండ్రి హత్యకు గురైయ్యాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. చింతల గోపి, వెంకట లక్ష్మీ భార్యభర్తలు. బతుకుదెరువు కోసం గుంటూరు జిల్లా నందిగామ నుంచి వలస వచ్చిన వీరు.. నల్గొండ జిల్లా కేంద్రంలో పాత సామాగ్రి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గతకొద్ది రోజులుగా భార్యభర్తల నడుమ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం […]
దిశ, నల్లగొండ: కూతురు అల్లుడికి మధ్య తరచూ గొడవలు అవుతున్నాయని.. సర్దిచెప్పడానికి వచ్చిన తండ్రి హత్యకు గురైయ్యాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. చింతల గోపి, వెంకట లక్ష్మీ భార్యభర్తలు. బతుకుదెరువు కోసం గుంటూరు జిల్లా నందిగామ నుంచి వలస వచ్చిన వీరు.. నల్గొండ జిల్లా కేంద్రంలో పాత సామాగ్రి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గతకొద్ది రోజులుగా భార్యభర్తల నడుమ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వెంకట లక్ష్మీ తండ్రి ఒంటిపల్లి వెంకటేశ్వర్లు నాలుగు రోజుల క్రితం నల్గొండకు వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం మామ అల్లులిద్దరూ మద్యం తాగారు. అనంతరం గొడవపై మామ ప్రశ్నించడంతో.. గోపి ఆగ్రహానికి గురైయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో పక్కనే ఉన్న రోలు తీసుకొని అల్లుడు మామ తలపై బలంగా కొట్టడంతో.. ఆయన అక్కడికక్కడే కుప్పకులాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.