ఆన్‌లైన్‌లోనే కొడుకును కడసారి చూసుకున్న జవాన్..

దిశ, వరంగల్: కరోనా మహమ్మారి వలన దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో పేగు బంధాలు దూరమవుతున్నాయి. కష్టకాలంలో కడసారి చూపునకు నోచుకోని దుస్థితి ఈ దేశంలో ఏర్పడింది. మొన్న ధర్మసాగర్ మండలంలో ఓ వ్యక్తి గుండె పోటు‌తో మరణించగా విదేశాల్లో ఉన్న కన్నబిడ్డలు చివరి చూపునకు నోచుకోలేదు. ఆన్‌లైన్‌లో అంత్యక్రియలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఈలాంటి ఘటనే వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని షాపురం గ్రామానికి చెందిన పేరాల రాకేష్ రాజస్తాన్ […]

Update: 2020-03-27 08:07 GMT

దిశ, వరంగల్: కరోనా మహమ్మారి వలన దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో పేగు బంధాలు దూరమవుతున్నాయి. కష్టకాలంలో కడసారి చూపునకు నోచుకోని దుస్థితి ఈ దేశంలో ఏర్పడింది. మొన్న ధర్మసాగర్ మండలంలో ఓ వ్యక్తి గుండె పోటు‌తో మరణించగా విదేశాల్లో ఉన్న కన్నబిడ్డలు చివరి చూపునకు నోచుకోలేదు. ఆన్‌లైన్‌లో అంత్యక్రియలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఈలాంటి ఘటనే వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని షాపురం గ్రామానికి చెందిన పేరాల రాకేష్ రాజస్తాన్ జైపూర్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన కుమారుడు తీవ్ర జ్వరంతో ఎంజీఎం చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి మృతిచెందాడు. లాక్‌డౌన్ కావడంతోజవాన్ ఊరికి రాలేక పోయాడు. దీంతో కన్నకొడుకును కడసారి చూపుకు నోచుకోలేకపోయాడు.ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో చివరగా వీడియో కాల్‌ ద్వారా విగత జీవిగా పడి ఉన్న కొడుకును చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషాదకర ఘటన గ్రామస్తుల హృదయాలను కలచి వేసింది.

Tags : son died, army dad see his son online, weeping,rajasthan, lockdown, warangal

Tags:    

Similar News