Ganja : గంజాయి స్మగ్లింగ్ లో వారు ఫేమస్..
గంజాయి స్మగ్లింగ్ లో వారు ఫేమస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించారు.
దిశ, జహీరాబాద్ : గంజాయి స్మగ్లింగ్ లో వారు ఫేమస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించారు. రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్న గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టి, వ్యాపారస్తుల ఆట కట్టించేందుకు డివిజన్ పోలీసులు నిరోధక చర్యలకు స్వీకారం చుట్టారు. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారు జామున 500ల మంది సిబ్బందితో డీఎస్పీ.రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల మూకుమ్మడి కార్యక్రమతో శేకాపూర్ తండా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సందర్భంగా 15 మంది అనుమానితులు అదుపులోకి తీసుకుని 50 వాహనాలు సీజ్ చేసినట్లు డీఎస్పీ.రామ్ మోహన్ రెడ్డి చెప్పారు. తండా కూడలిలో కార్యక్రమాన్ని ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ అత్యధికంగా గంజాయి స్మగ్లర్లు తండాలో ఉన్నట్లు, గతంలో అనేక సార్లు గ్రామంలో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. గంజాయి వ్యాపారం మానుకోవాలని మరోసారి హెచ్చరించారు. తండాకు చెందిన గంజాయి స్మగ్లర్లను అప్పగించాలని కోరారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులను వాహనాలను జప్తు చేశామన్నారు.
ఇదివరకే పలువురు స్మగ్లర్లను అరెస్టు చేశామని, మరికొందరు పరారీలో ఉన్నా నిరంతరం కుటుంబ సభ్యులు, స్థానికులతో సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. తండా క్షేమం, వారి కుటుంబ సంక్షేమం కోసం వారిని పట్టించాలని సూచించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు చూపించి జహీరాబాద్ రూరల్ పోలిస్టేషన్లో చూపించి వాటిని తీసుకోవాలని సూచించారు. గంజాయి స్మగ్లింగ్ లో తండావాసులు ఉన్నట్లు తెలిసిందని, స్థానికులు వారిని స్వచ్చందంగా పోలీసులకు అప్పగించాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. లేనిపక్షంలో అందుకు విరుద్ధమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చెట్ట విరుద్ధమైన గంజాయి స్మగ్లింగ్ ప్రభుత్వానికి సమస్యగా పరిణమించిందని, స్మగ్లింగ్ నిరోధక చర్యలో భాగంగానే మంగళవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. స్థానికులు స్పందిస్తూ పోలీసులకు పూర్తిసహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సీఐ.శివలింగం, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.