Pawan Kalyan వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత రియాక్షన్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలను పాజిటివ్‌గా తీసుకుంటానని, ఆయనతో క్లారీటీగా మాట్లాడానని అనిత అన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల అధికారులతో హోం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. ‘మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలపై చర్చించాం. నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించాం. పవన్ కల్యాణ్ బయట పడ్డారు.. మేము పడలేదు. లా అండ్ ఆర్డర్ పకడ్బందిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం’’ అని అనిత అన్నారు.
అలాగే రాష్ట్రంలో జరుగుతున్న నేరాల విషయంలో అందరికీ బాధ ఉందని, శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ జరగడం బాధాకరమని, గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించడం వల్లే ఇప్పడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శిక్షలు తక్షణం అమలు చేయడానికి ప్రత్యేక కోర్టులు కావల్సి ఉందని, ఇలాంటి అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కచ్చితంగా చర్యలుంటాయని చెప్పారు. వైసీపీ పాలనలో పోలీసులు కూడా ఇబ్బందులు పడ్డారని, జగన్‌కు భావప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ఆమె ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే సోమవారం ఉదయం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తాను అడగలేక కాదని.. హోంశాఖ తీసుకోలేక కాదని.. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉండేయని చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఆ కామెంట్స్ పైనే తాజాగా అనిత రియాక్ట్ అయ్యారు.