రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి
దిశ, నల్లగొండ: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందిన విషాదకర ఘటన యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజీ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మహబూబాబాద్‌కు చెందిన తల్లీకొడుకులు సాయితేజ్(19), మంజుల(41)లతో పాటు కుటుంబ సభ్యులు రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం తిమ్మపురం శివారులోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే కంపెనీ మూత పడగా, శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ఇద్దరూ బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో తాళ్లగూడెం శివారులోని వంతెనపై […]
దిశ, నల్లగొండ: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందిన విషాదకర ఘటన యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజీ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మహబూబాబాద్‌కు చెందిన తల్లీకొడుకులు సాయితేజ్(19), మంజుల(41)లతో పాటు కుటుంబ సభ్యులు రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం తిమ్మపురం శివారులోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే కంపెనీ మూత పడగా, శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ఇద్దరూ బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో తాళ్లగూడెం శివారులోని వంతెనపై వెళ్తుండగా, వారి బైక్ రేలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయితేజ అక్కడికక్కడే మృతి చెందగా, మంజులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు యాదగిరిగుట్ట ఇన్‌స్పెక్టర్ పాండురంగారెడ్డి తెలిపారు.
tags: bike accident, yadagirigutta, thalla gudem, accident, lockdown, mahabubabad, mother and son died,