పెట్రో ధరలపై సీఎం జగన్‌కు లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర ఛీప్ సోమువీర్రాజు

దిశ, ఏపీ బ్యూరో: సోమువీర్రాజు సీఎం జగన్‌కు మంగళవారం లేఖ రాశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్రో ధరలు తగ్గిస్తుంటే మన రాష్ట్రంలో ఎందుకు తగ్గించడం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజలపై భారం పడకూడదనే ఆలోచనతో పెట్రో ధరలు తగ్గించిందని, సీఎం జగన్ సర్కార్ ఎందుకు తగ్గించట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ధరలపై విడుదల చేసిన ప్రకటన తప్పుల తడకగా ఉందని పేర్కొన్నారు. వాస్తవాలు తెలిపి […]

Update: 2021-11-09 06:57 GMT

దిశ, ఏపీ బ్యూరో: సోమువీర్రాజు సీఎం జగన్‌కు మంగళవారం లేఖ రాశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్రో ధరలు తగ్గిస్తుంటే మన రాష్ట్రంలో ఎందుకు తగ్గించడం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజలపై భారం పడకూడదనే ఆలోచనతో పెట్రో ధరలు తగ్గించిందని, సీఎం జగన్ సర్కార్ ఎందుకు తగ్గించట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ధరలపై విడుదల చేసిన ప్రకటన తప్పుల తడకగా ఉందని పేర్కొన్నారు. వాస్తవాలు తెలిపి మళ్లీ సొంత ఖర్చుతో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.25 విలువ చేసే చీప్‌ లిక్కర్‌ బాటిల్‌ను రూ.250కి విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.

నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండటం వల్లే దేశ రక్షణ వ్యవస్థ బలోపేతమైందని స్పష్టం చేశారు. ఆయితే బీజేపీని తోక పార్టీ అని విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో సహా 18 రాష్ట్రాల్లో ప్రభుత్వం తమదేనని, 2024లో ఏపీలోనూ అధికారంలోకి రాబోతోన్నామని అలాంటి పార్టీని తోకపార్టీగా ఎలా అభివర్ణిస్తారని మండిపడ్డారు. బద్వేలులో డిపాజిట్ దక్కలేదని ప్రచారం చేస్తున్నారని అక్రమాలు జరగకుండా ఉంటే మాకు చాలా ఓట్లు వచ్చేవని పేర్కొన్నారు. విజయవాడలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.

స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీలతో కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న సాయంపై నియోజకవర్గం, మండల స్థాయిలో కరపత్రాలను ముద్రించి ప్రజలకు పంచుతామని ప్రకటించారు. సీఎం జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజాందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు.

భువనేశ్వర్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం..

Tags:    

Similar News