‘ఆనందయ్యకు తెలియకుండా కాకాణి కోట్ల వ్యాపారం’
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కృష్ణపట్నం ఆనందయ్య మందుపై రాజకీయ రగడ కొనసాగుతుంది. ఆనందయ్య అనుమతి లేకుండానే వెబ్సైట్ను క్రియేట్ చేసి.. కోట్లు దండుకునేందుకు కాకాణి కుట్ర చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి మరోసారి ఆరోపించారు. ఇక ఇదే విషయంపై సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను దొంగతనం, ఫోర్జరీ ఎక్కడ చేశానని… అసలు ఇన్ని సెక్షన్ల కింద కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. గత నెల 17వ తేదీన ఆనందయ్య మందును అడ్డుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని.. మా వల్ల […]
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కృష్ణపట్నం ఆనందయ్య మందుపై రాజకీయ రగడ కొనసాగుతుంది. ఆనందయ్య అనుమతి లేకుండానే వెబ్సైట్ను క్రియేట్ చేసి.. కోట్లు దండుకునేందుకు కాకాణి కుట్ర చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి మరోసారి ఆరోపించారు. ఇక ఇదే విషయంపై సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను దొంగతనం, ఫోర్జరీ ఎక్కడ చేశానని… అసలు ఇన్ని సెక్షన్ల కింద కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. గత నెల 17వ తేదీన ఆనందయ్య మందును అడ్డుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని.. మా వల్ల ఎప్పుడు ఆటంకం కలుగలేదన్నారు. ఆన్లైన్లో మందు పంపిణీ ఉంటుందని చెప్పిన ఎమ్మెల్యే కాకాణి.. వెబ్సైట్ క్రియేట్ చేయించారని చెప్పారు. ఆనందయ్య మందును క్యాష్ చేసుకోవాలని చూశారని.. ఈ కుట్రను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.