ప్రయాణికులకు అలర్ట్: 14 రైళ్లు క్యాన్సిల్
దిశ, వెబ్‌డెస్క్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. 14 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో పలు రైళ్లను రద్దు చేసింది. రద్దైన ట్రైన్లు ఆదిలాబాద్-సీఎస్‌టి ముంబై సర్వీస్ 24 నుంచి 27 వరకు రద్దు చేసింది. సీఎస్‌టీ ముంబై-ఆదిలాబాద్ రైలు సర్వీస్ ఈ నెల 25 నుంచి 28 వరకు, […]
దిశ, వెబ్‌డెస్క్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. 14 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో పలు రైళ్లను రద్దు చేసింది.
రద్దైన ట్రైన్లు
ఆదిలాబాద్-సీఎస్‌టి ముంబై సర్వీస్ 24 నుంచి 27 వరకు రద్దు చేసింది. సీఎస్‌టీ ముంబై-ఆదిలాబాద్ రైలు సర్వీస్ ఈ నెల 25 నుంచి 28 వరకు, హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై 24 నుంచి 27 వరకు, సీఎస్‌టీ ముంబై-హైదరాబాద్ ట్రైన్ 25 నుంచి 28 వరకు, సికింద్రాబాద్-ఎల్‌టీటీ ముంబై ట్రైన్ ఈ నెల 27న, ఎల్‌టీటీ ముంబై-సికింద్రాబాద్ ట్రైన్ ఈ నెల 28న రద్దు చేశారు.