తిరుమలలో దారుణం.. శ్రీవారి దర్శనం చేయిస్తామని..!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుమలలో దారుణం చోటుచేసుకుంది. కొందరు దళారులు శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులను టార్గెట్ చేసిన దళారులు వారు వినియోగించుకునే సుపథం మార్గంలో దర్శనం కల్పిస్తామని నిండా ముంచుతున్నారు. అందుకోసం ఏకంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేరుతో మెసేజ్‌లు పంపిస్తున్నట్టు తెలిసింది. ఒక్కో టిక్కెట్‌కు రూ.8వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా దళారుల నుంచి టిక్కెట్లు పొందిన […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుమలలో దారుణం చోటుచేసుకుంది. కొందరు దళారులు శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులను టార్గెట్ చేసిన దళారులు వారు వినియోగించుకునే సుపథం మార్గంలో దర్శనం కల్పిస్తామని నిండా ముంచుతున్నారు. అందుకోసం ఏకంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేరుతో మెసేజ్‌లు పంపిస్తున్నట్టు తెలిసింది. ఒక్కో టిక్కెట్‌కు రూ.8వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా దళారుల నుంచి టిక్కెట్లు పొందిన కొందరు చైర్మన్ కార్యాలయాన్ని సంప్రదించగా అవి నకిలీవి అని అధికారులు తేల్చారు. దీంతో అసలు విషయం వెలుగులోకివచ్చింది.