ప్రతీ క్వార్టర్‌లో కొత్త నియామకాలు : హ్యాపీయెస్ట్ మైండ్స్
దిశ, వెబ్‌డెస్క్ : బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ రానున్న త్రైమాసికాల్లో అదనంగా 300 మంది టెక్ నిపుణులను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. కంపెనీ అట్రిషన్ రేటు 14.7 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబోయే మూడు త్రైమాసికాల్లో ఒక్కో త్రైమాసికానికి 300 మందిని తీసుకునేందుకు ప్రణాళికలను కలిగి ఉన్నాము. జూన్ త్రైమాసికానికి తీసుకున్న 310 మందితో కలిపి సంస్థలో మొత్తం […]
దిశ, వెబ్‌డెస్క్ : బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ రానున్న త్రైమాసికాల్లో అదనంగా 300 మంది టెక్ నిపుణులను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. కంపెనీ అట్రిషన్ రేటు 14.7 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబోయే మూడు త్రైమాసికాల్లో ఒక్కో త్రైమాసికానికి 300 మందిని తీసుకునేందుకు ప్రణాళికలను కలిగి ఉన్నాము. జూన్ త్రైమాసికానికి తీసుకున్న 310 మందితో కలిపి సంస్థలో మొత్తం 3,538 మంది ఉన్నారు.
ప్రతి త్రైమాసికంలో నియామకాల వేగాన్ని ఇదే ధోరణిలో కొనసాగించాలని ఆశిస్తున్నట్టు’ హ్యాపియెస్ట్ మైండ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్ జోసెఫ్ అనంతరాజు అన్నారు. కంపెనీలో 2-6 ఏళ్ల అనుభవం కలిగిన వారు ఇతర సంస్థల్లో భారీ వేతన పెంపుతో పాటు కొత్త ఉద్యోగాలని సాధించగలుగుతున్నారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వెంకట్రామన్ నారాయణన్ చెప్పారు. కాగా, గతేడాది సెప్టెంబర్‌లో ఐపీఓలో భాగంగా 151 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ సాధించిన హ్యాపీయెస్ట్ మైండ్స్ సంస్థ అప్పటినుంచి ఇప్పటివరకు 562 శతానికి పైగా రిటర్నులను ఇచ్చిందని వెంకట్రామన్ వివరించారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో హ్యాపీయెస్ట్ మైండ్స్ సంస్థ ఆదాయం 29 శాతం క్షీణించి రూ. 35.73 కోట్లను నమోదు చేసింది.