ఓ బాలుడా .. నీ పని బాగుంది!

దిశ, వెబ్ డెస్క్: సుశంతా నందా అనే ఒక ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలోని దృశ్యం విదేశంలో చోటు చేసుకున్న ఓ సంఘటన. అదేమిటంటే.. ఓ వ్యక్తి కారులో నుంచి ఒక బాటిల్ ను రోడ్డు పై అలా పడేశాడు. ఆ సమయంలో అప్పుడే అటువైపుగా తండ్రితో కలిసి వస్తోన్న ఓ బాలుడు ఈ విషయాన్ని గమనించి.. అక్కడకు చేరుకోగానే ఆ వ్యక్తి పడేసిన ఆ బాటిల్ […]

Update: 2020-05-11 23:55 GMT

దిశ, వెబ్ డెస్క్: సుశంతా నందా అనే ఒక ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలోని దృశ్యం విదేశంలో చోటు చేసుకున్న ఓ సంఘటన. అదేమిటంటే.. ఓ వ్యక్తి కారులో నుంచి ఒక బాటిల్ ను రోడ్డు పై అలా పడేశాడు. ఆ సమయంలో అప్పుడే అటువైపుగా తండ్రితో కలిసి వస్తోన్న ఓ బాలుడు ఈ విషయాన్ని గమనించి.. అక్కడకు చేరుకోగానే ఆ వ్యక్తి పడేసిన ఆ బాటిల్ ను తిరిగి అదే కారులోకి విసిరేశాడు. ఎందుకంటే రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది పడేయడానికి వీలు లేదు అక్కడ. దాని ద్వారా కాలుష్యం పెరుగుతది. అంతేకాదు ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశముంది. వస్తువులను ఉపయోగించిన తర్వాత ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ పడేయొద్దు.. చెత్తబుట్టలలో వేయాలనేది ఆ బాలుడి భావన. అందుకే కారులోకి ఆ బాటిల్ ను విసిరేసి అతనికి గుణపాఠం నేర్పాడు. అందుకే ఆ వీడియో తెగ వైరలవుతోన్నది. అది చూసిన ప్రతి ఒక్కరూ ఆ బాలుడిని మెచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News