పెళ్లి చేసుకున్నాడు కానీ.. అంతకుముందే నా భర్త నన్ను రేప్ చేశాడు: నటి ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: తన భర్త తనని పెళ్లి చేసుకునే ముందే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బుల్లితెర నటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటకకు చెందిన ఓ బుల్లితెర నటి, ఆమె భర్త ఇద్దరూ కూడా సినిమా రంగంలో రాణించాలని ఆ దిశగా ముందుకెళ్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమెకు టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒకరోజు కలుద్దామన్నాడు. దీంతో […]
దిశ, వెబ్ డెస్క్: తన భర్త తనని పెళ్లి చేసుకునే ముందే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బుల్లితెర నటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటకకు చెందిన ఓ బుల్లితెర నటి, ఆమె భర్త ఇద్దరూ కూడా సినిమా రంగంలో రాణించాలని ఆ దిశగా ముందుకెళ్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమెకు టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒకరోజు కలుద్దామన్నాడు. దీంతో ఆమె తన ఇంటికి ఆహ్వానించింది. అయితే, ఆ సమయంలో అతను ఆ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా అనేకసార్లు వాంఛలు తీర్చుకున్న అతడిని పెళ్లి చేసుకోవాలని అడగడంతో ఆమెకు దూరంగా ఉండసాగాడు. స్నేహితుల ద్వారా అతడిని ఒప్పించి గుడిలో తాము పెళ్లి చేసుకున్నామని, ఆ తర్వాత అత్తింటికి తీసుకెళ్లినంక తనకు బలవంతంగా తాళి కట్టానని భర్త చెప్పుకున్నాడు. ఆ రోజు నుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కట్నం తేవాలని ప్రతిరోజూ ఒత్తిడి చేస్తున్నాడని, కులం పేరుతో దూషిస్తున్నాడని వాపోయింది. ఈ క్రమంలో తాను తీవ్ర అనారోగ్యంపాలై ఆస్పత్రిలో ఉన్నట్లు నటి తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.