‘నారదా’ కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రులపై ఈడీ చార్జిషీట్
దిశ వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో రాష్ట్ర రవాణా, గృహనిర్మాణ శాఖ మంత్రి ఫిర్హద్ హకీం, పంచాయతీశాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. వీరితోపాటు అధికార టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీల పేర్లనూ ఇందులో చేర్చింది. ఈ చార్జిషీట్‌ను బుధవారం ప్రత్యేక కోర్టుకు ఈడీ అందించింది. చార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్న నేతలకు ప్రత్యేక కోర్టు సమన్లు […]
దిశ వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో రాష్ట్ర రవాణా, గృహనిర్మాణ శాఖ మంత్రి ఫిర్హద్ హకీం, పంచాయతీశాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. వీరితోపాటు అధికార టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీల పేర్లనూ ఇందులో చేర్చింది. ఈ చార్జిషీట్‌ను బుధవారం ప్రత్యేక కోర్టుకు ఈడీ అందించింది. చార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్న నేతలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీచేసింది. సదరు వ్యక్తులు నవంబర్ 16లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఈడీ నమోదు చేసిన వ్యక్తులతోపాటు సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి ఎస్ఎమ్‌హెచ్ మీర్జాపైనా కోర్టు దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో నిందితులకు గరిష్ఠ శిక్ష విధించాలని దర్యాప్తు సంస్థ కోర్టును కోరింది. కాగా, 2014లో నారదా న్యూస్ ఓ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా కొందరు వ్యక్తులు షెల్ కంపెనీ ప్రతినిధులుగా మంత్రుల దగ్గరికి వెళ్లగా, వీరి నుంచి సదరు మంత్రులు రూ.5లక్షల వరకు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఇందుకు సంబంధించిన టేప్స్ 2016లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలయ్యాయి. ఈ ఫుటేజీలో టీఎంసీ నేతలు సుబ్రతా ముఖర్జీ, అపరూప పొద్దార్, సౌగత రే, కాకోలీ ఘోష్ దస్తీదార్, ప్రసూన్ బెనర్జీ, మదన్ మిత్రా, ఫిర్హాద్ హకీమ్, ఇక్బాల్ అహ్మద్ కనిపిస్తారు. దీంతో అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫుటేజీ సంచలనంగా మారింది. అయినప్పటికీ 2016 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఎంసీ తిరిగి అధికారం చేపట్టింది. నారదా కేసులో ఈ ఏడాది ఆరంభంలో హకీం, ముఖర్జీ, మిత్రాలను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కొద్దిరోజులకు వారికి బెయిల్ లభించింది. ఇదిలా ఉండగా, ఈడీ తాజా చార్జిషీట్‌పై టీఎంసీ మండిపడింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేసింది.