స్వల్పంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
న్యూఢిల్లీ : గడిచిన రెండు నెలలుగా అడ్డూ అదుపూ లేకుండా వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన ఆయిల్ కంపెనీలు ఎట్టకేలకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఏప్రిల్ 1 నుంచి ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ ధరలు రూ. 10 తగ్గనున్నాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. తగ్గిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది జనవరిలో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 694 ఉండగా మార్చిలో అది […]
న్యూఢిల్లీ : గడిచిన రెండు నెలలుగా అడ్డూ అదుపూ లేకుండా వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన ఆయిల్ కంపెనీలు ఎట్టకేలకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఏప్రిల్ 1 నుంచి ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ ధరలు రూ. 10 తగ్గనున్నాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. తగ్గిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ ఏడాది జనవరిలో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 694 ఉండగా మార్చిలో అది రూ. 819 (మూడు నెలల్లో రూ. 125 పెరిగింది) కు పెరిగింది. తాజా తగ్గింపుతో దేశ రాజధానిలో సిలిండర్ రూ. 809 కు చేరింది. హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 861.50 గా ఉంది.