లిప్‌స్టిక్ పెట్టుకున్న యువకుడి ఫొటోలు వైరల్.. ఎందుకు?
దిశ, వెబ్‌డెస్క్: బాడీ షేమింగ్, జెండర్ షేమింగ్ విషయాల్లో ఎవరికైనా అవమానం జరిగితే సోషల్ మీడియా అస్సలే ఊరుకోదు. తమకు బాగా తెలిసిన కామెంట్, షేర్, లైక్, స్టేటస్, స్టోరీల రూపంలో అవమానించిన వారిని మళ్లీ డిజిటల్ శైలిలో అవమానించే వరకు నిద్రపోదు. అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరి టైమ్‌లైన్, స్టేటస్, స్టోరీల్లో చూసినా ఎరుపు రంగు లిప్‌స్టిక్ పెట్టుకుని గడ్డంతో ఉన్న ఓ యువకుడి ఫొటోలే కనిపిస్తున్నాయి. మరి […]
దిశ, వెబ్‌డెస్క్: బాడీ షేమింగ్, జెండర్ షేమింగ్ విషయాల్లో ఎవరికైనా అవమానం జరిగితే సోషల్ మీడియా అస్సలే ఊరుకోదు. తమకు బాగా తెలిసిన కామెంట్, షేర్, లైక్, స్టేటస్, స్టోరీల రూపంలో అవమానించిన వారిని మళ్లీ డిజిటల్ శైలిలో అవమానించే వరకు నిద్రపోదు. అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరి టైమ్‌లైన్, స్టేటస్, స్టోరీల్లో చూసినా ఎరుపు రంగు లిప్‌స్టిక్ పెట్టుకుని గడ్డంతో ఉన్న ఓ యువకుడి ఫొటోలే కనిపిస్తున్నాయి. మరి ఆ యువకుడు ఎవరు? అలా లిప్‌స్టిక్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ జరిగిన అవమానం ఏంటి?
ఆ యువకుడి పేరు పుష్పక్ సేన్. కోల్‌కతాలో ఉంటాడు. వాళ్ల అమ్మ వయస్సు 54 సంవత్సరాలు. ఇటీవల జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కు వాళ్లమ్మ ఎరుపు రంగు లిప్‌స్టిక్ వేసుకుని వెళ్లింది. అది చూసిన వారి దగ్గరి బంధువులందరూ ఆమె మీద పిచ్చిపిచ్చి కామెంట్లు చేశారు. వస్త్రాలంకరణ, మేకప్ అనేది వ్యక్తిగత విషయం. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉంటారు. ఇతరులను మెప్పించాల్సిన అవసరం లేదు. ఇలా అందరూ తన తల్లి లిప్‌స్టిక్ గురించి కామెంట్ చేశారన్న సంగతి తెలిసిన పుష్పక్ ఇలా చేశాడు. తాను కూడా అదే లిప్‌స్టిక్ పెట్టుకుని ఫొటో దిగి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాకుండా అదే ఫొటోను తమ కుటుంబ సభ్యులకు పంపి, ఇకనైనా మారండంటూ మెసేజ్‌లు పెట్టాడు. ఈ కథను మొత్తం తన సోషల్ మీడియాలో ఖాతాలో పుష్పక్ పోస్ట్ చేశాడు. ఇది చదివిన నెటిజన్లు, పుష్పక్ ఫొటోను షేర్ చేసి, ఇలా వ్యక్తిగత అందం, అభిరుచుల మీద కామెంట్ చేసే వాళ్లందరికీ బుద్ధి చెబుతున్నారు.