నియోజకవర్గానికో నైపుణ్యాభివృద్ధి కేంద్రం..!

దిశ, ఏపీ బ్యూరో: ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఓ నైపుణ్యాభివృద్ధి కాలేజీ ఉండేలా.. రాష్ట్రవ్యాప్తంగా 30 కాలేజీల నిర్మాణం దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సీఎం జగన్​ వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డితోపాటు సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. అనంతరాము, స్పెషల్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జా […]

Update: 2020-09-01 10:06 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఓ నైపుణ్యాభివృద్ధి కాలేజీ ఉండేలా.. రాష్ట్రవ్యాప్తంగా 30 కాలేజీల నిర్మాణం దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సీఎం జగన్​ వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డితోపాటు సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. అనంతరాము, స్పెషల్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్ఎస్‎డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కాలేజీల భవన నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కాలేజీల్లో ఫినిషింగ్ స్కిల్ కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సుల్లో భాగంగా వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపైనా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికశాఖతో చర్చించి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధంచేసుకుని పనులు త్వరగా మొదలుపెట్టాలని సూచించారు.

Tags:    

Similar News