వరుసగా ఆరో రోజు పెరిగిన చమురు ధరలు

దిశ, వెబ్‌డెస్క్: చమురు ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతునే ఉన్నాయి. ఈ నెలలో 8వ సారి ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పలు నగరాల్లో 34 పైసల వరకు పెరిగింది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం..హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.26, డీజిల్ ధర రూ.86.23కి చేరింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.91.71, డీజిల్ రూ.85.64 కొనసాగుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై […]

Update: 2021-02-13 22:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: చమురు ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతునే ఉన్నాయి. ఈ నెలలో 8వ సారి ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పలు నగరాల్లో 34 పైసల వరకు పెరిగింది.

తాజాగా పెరిగిన ధరల ప్రకారం..హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.26, డీజిల్ ధర రూ.86.23కి చేరింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.91.71, డీజిల్ రూ.85.64 కొనసాగుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్ పై 32 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.73, డీజిల్ రూ.79.06కి చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.21, డీజిల్ రూ.86.04 కొనసాగుతున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News