బాలికపై క్షుద్రపూజలు.. ఆరుగురు వ్యక్తులు పొలంలోకి లాకెళ్లి..
దిశ, వెబ్డెస్క్ : రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నా.. అక్కడక్కడా ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాలు మాత్రం పోవడంలేదు. మాఢనమ్మకాల కారణంగా ఇప్పటికే ఎంతో బలైయ్యారు. తాజాగా నరబలి కోసం క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తి ఓ పదేళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అనంతరం తమ కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి బాలికపై క్షుద్రపూజలు చేస్తుండగా కనిపెట్టారు. . అనంతరం రక్షించి ఇంటికి తీసుకువచ్చారు. ఈ దారుణ ఘటన కర్నాటకలోని నేలమంగళలో జూన్ 14వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి […]
దిశ, వెబ్డెస్క్ : రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నా.. అక్కడక్కడా ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాలు మాత్రం పోవడంలేదు. మాఢనమ్మకాల కారణంగా ఇప్పటికే ఎంతో బలైయ్యారు. తాజాగా నరబలి కోసం క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తి ఓ పదేళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అనంతరం తమ కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి బాలికపై క్షుద్రపూజలు చేస్తుండగా కనిపెట్టారు. .
అనంతరం రక్షించి ఇంటికి తీసుకువచ్చారు. ఈ దారుణ ఘటన కర్నాటకలోని నేలమంగళలో జూన్ 14వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. సోలదేవనహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీ గ్రామ్కు చెందిన పదేళ్ల బాలిక ఇంటిముందు ఆడుకుంటోంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ మాంత్రికుడు, ఐదుగురు వ్యక్తులు.. ఆ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం దగ్గరలో ఉన్న ఓ పొలంలో బాలికపై క్షుద్రపూజలు జరిపారు.
ఈ క్రమంలో.. తమ కూతురు కనిపించకపోవడంతో కంగారుపడిన బాలిక తల్లిదండ్రులు.. వెంటనే చుట్టుపక్కల వెతకగా.. పొలంలో బాలికపై క్షుద్రపూజలు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే బాలికను కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు, ఓ మాంత్రికుడు.. కలిసి పాపను బలి ఇవ్వాలని ఎత్తుకెళ్లారని సదురు బాలిక.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు.