వరల్డ్ ఫేమస్ నేచురల్ వండర్స్
దిశ, ఫీచర్స్ : కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. అత్యతవసర ప్రభుత్వ కార్యాలయాలు తప్ప.. మిగతా కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నాయి. కొన్ని ఆఫీసులు పూర్తిగా కార్యకలాపాలను నిలిపేశాయి. ఈ క్రమంలో చాలామంది ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు నెలకొనగా.. ప్రకృతిలో విహారించేందుకు మనసు ఉవ్విళ్లూరుతున్నా, వెళ్లేందుకు వీల్లేదు. అయితే పాండమిక్ పరిస్థితులు నార్మల్ అయ్యేలోగా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలను వర్చువల్‌గా చుట్టేసే అవకాశాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేరు. […]
దిశ, ఫీచర్స్ : కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. అత్యతవసర ప్రభుత్వ కార్యాలయాలు తప్ప.. మిగతా కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నాయి. కొన్ని ఆఫీసులు పూర్తిగా కార్యకలాపాలను నిలిపేశాయి. ఈ క్రమంలో చాలామంది ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు నెలకొనగా.. ప్రకృతిలో విహారించేందుకు మనసు ఉవ్విళ్లూరుతున్నా, వెళ్లేందుకు వీల్లేదు. అయితే పాండమిక్ పరిస్థితులు నార్మల్ అయ్యేలోగా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలను వర్చువల్‌గా చుట్టేసే అవకాశాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి ఆరు అత్యద్భుత నేచురల్ వండర్స్ గురించిన సమాచారం మీ కోసం..
విక్టోరియా ఫాల్స్..
జింబాబ్వే, జాంబియా దేశాల సరిహద్దులో నెలకొన్న విక్టోరియా జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దీనికి గల అనేక పారామితులు ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతంగా పేరు తెచ్చిపెట్టగా.. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ గుర్తించబడింది. కాగా నమ్మశక్యం కాని ప్రకృతి చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోవాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించి తీరాల్సిందే.
గ్రేట్ బారిఫ్ రీఫ్..
ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దీవి ‘గ్రేట్ బారిఫ్ రీఫ్’. స్పేస్ నుంచి కూడా కనిపించే ఈ దీవి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతి అద్భుతాల్లో ఒకటి. ప్రస్తుతం దీని సున్నితమైన జీవావరణ వ్యవస్థ పర్యావరణ ముప్పును ఎదుర్కొంటుండగా.. ఈ విధ్వంసం నుంచి సంరక్షించేదుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా మొత్తం దీవి 29000 ఇండివిడ్యువల్ దీవులతో 3,44,400 చ.కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
అరోరా..
నార్తర్న్ లైట్స్‌గా ప్రఖ్యాతి చెందిన ఈ నేచురల్ స్పాట్.. ప్రతీ ట్రావెలర్ సందర్శించాలనుకుంటాడు. వారు వెళ్లదలచుకున్న టూర్స్ జాబితాలో ఈ ప్రదేశానికి తప్పక చోటు ఉంటుంది. ఇది భూమి ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల చుట్టూ ఉన్న ఎత్తైన ప్రదేశాల నుంచి కనిపిస్తుంది. కాగా ఈ లైట్స్‌ను నార్వే, ఫిన్‌లాండ్, స్వీడన్, ఐస్‌ల్యాండ్, నార్తర్న్ కెనడా దేశాల్లోని పలు ప్రాంతాల నుంచి కొన్ని నిర్దిష్ట నెలల్లో ఈ ప్రదేశాన్ని చూడవచ్చు.
గ్రాండ్ కేనియన్..
కొలరాడో నదీ ప్రవాహం వెంట కొండచరియలతో ఏర్పడిన ప్రాంతం గ్రాండ్ కేనియన్. ఈ ప్రదేశాన్ని మొదటిసారి చూసినపుడు ఊపిరి బిగబట్టుకుంటారు. రెండు బిలియన్ సంవత్సరాల కిందట నుంచి నదీ ప్రవాహములో మార్పులు జరిగిన కారణంగా ఇక్కడి భూమి ఊచకోతకు గురైంది. దాంతో ప్రస్తుతం కనిపిస్తున్న గ్రాండ్ కేనియన్ కొండచరియల దృశ్యాలు ఏర్పడ్డాయి. ఇవి 277 మైళ్ళ పొడవు (446 కిలోమీటర్లు), 18 మైళ్ళ వెడల్పు (29 కిలోమీటర్లు), 1 మైలు లోతు (6, 000 నుంచి 18, 000) విస్తరించి ఉన్నాయి.
మౌంట్ ఎవరెస్ట్..
8849 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్.. నేచురల్ వండర్స్‌లో ఒకటిగా వెలుగొందుతోంది. ప్రతీ సంవత్సరం ట్రెక్కింగ్ సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెక్కర్స్ ఎవరెస్ట్‌ను ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో 2009లో భారీగా హ్యూమన్ ట్రాఫిక్‌ను ఎదుర్కొంది.
రియో డి జనీరో హార్బర్..
బ్రెజిల్‌లోని రియోలో గల ఈ హార్బర్.. ప్రపంచంలోని అత్యంత అందమైన హార్బర్స్‌లో ఒకటి. రెండు పర్వతాల మధ్య 20 మైళ్ల విస్తీర్ణంతో విస్తరించి ఉండగా.. ఒక పర్వతంపై జీసస్ క్రీస్ట్ వరల్డ్ ఫేమస్ విగ్రహాన్ని చూడొచ్చు.