కావాలంటే నన్ను కాల్చేసి వాళ్లని వదిలేయండి

దిశ,వెబ్‌డెస్క్:మయన్మార్ లో పాలనను సైన్యం హస్తగతం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సైన్యం యా౦గోన్, మైట్కినా, సిట్వేలో, రఖైన్ రాజధాని రఖైన్లో ప్రజల నిరసనను అడ్డుకునేందుకు భారీ ఆయుధ వాహనాల్ని మోహరించింది. ఓ వైపు ప్రజల తిరుగుబాటు ను నిలువరించేందుకు సైనికులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి, రబ్బరు బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు. ఈ సందర్భంగా కాచిన్ రాష్ట్ర రాజధాని మైట్కినా వీధుల్లో ఆందోళన కారులపై సైన్యం కాల్పులు జరిపి, వారిని అరెస్ట్ చేసేందుకు […]

Update: 2021-03-09 10:28 GMT

దిశ,వెబ్‌డెస్క్:మయన్మార్ లో పాలనను సైన్యం హస్తగతం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సైన్యం యా౦గోన్, మైట్కినా, సిట్వేలో, రఖైన్ రాజధాని రఖైన్లో ప్రజల నిరసనను అడ్డుకునేందుకు భారీ ఆయుధ వాహనాల్ని మోహరించింది. ఓ వైపు ప్రజల తిరుగుబాటు ను నిలువరించేందుకు సైనికులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి, రబ్బరు బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు. ఈ సందర్భంగా కాచిన్ రాష్ట్ర రాజధాని మైట్కినా వీధుల్లో ఆందోళన కారులపై సైన్యం కాల్పులు జరిపి, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే సైన్యానికి ఎదురెళ్లిన సిస్టర్ ఆన్ రోజ్ఆందోళన కారుల్ని ఏమీ చేయోద్దని, వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని మోకాళ్లపై కూర్చొని ప్రాధేయపడింది. కావాలంటే తనను కాల్చి వాళ్లని వదిలేయాలని కోరింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సిస్టర్ ఆన్ రోజ్ మాట్లాడుతూ సైనికులు కాల్పులకు బయపడి పిల్లలు పరిగెత్తుతున్నారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించాను. పిల్లల కంటే ముందే తనని కాల్చి చంపాలని వేడుకున్నట్లు తెలిపారు. అయినా ఆందోళన చేస్తున్న ఇద్దరిపై సైనికులు కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో వారు మరణించినట్లు సిస్టర్ ఆన్ రోజ్ కన్నీటి పర్యంతమైంది.

Tags:    

Similar News