కలుపు యంత్రం తయారు చేసిన సిరిసిల్ల మెకానిక్
దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన రాగి కిషన్.. కలుపు తీసే యంత్రాన్ని తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. 35ఏళ్లుగా గొల్లపల్లిలో మెకానిక్‌గా పనిచేస్తున్న ఆయన.. పత్తి చేనులో కలుపు తీయడానికి రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి ఏదైనా యంత్రం తయారు చేసి కష్టాలను తీర్చాలనుకున్నాడు. ఇదే క్రమంలో రూ.45వేల వ్యయంతో నెలరోజుల వ్యవధిలోనే కలుపు తీసే పవర్ టిల్లర్‌ను తయారు చేశాడు. రెండు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవున్న […]
దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన రాగి కిషన్.. కలుపు తీసే యంత్రాన్ని తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. 35ఏళ్లుగా గొల్లపల్లిలో మెకానిక్‌గా పనిచేస్తున్న ఆయన.. పత్తి చేనులో కలుపు తీయడానికి రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి ఏదైనా యంత్రం తయారు చేసి కష్టాలను తీర్చాలనుకున్నాడు. ఇదే క్రమంలో రూ.45వేల వ్యయంతో నెలరోజుల వ్యవధిలోనే కలుపు తీసే పవర్ టిల్లర్‌ను తయారు చేశాడు. రెండు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవున్న ఈ పవర్ టిల్లర్ మొక్కల వరుసల మధ్య సులభంగా కదులుతుందని ఆయన చెప్పుకొచ్చాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో పంట చేలల్లో కలుపు తీయడానికి కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కిషన్ చేసిన యంత్రంతో రెండు గంటల్లో ఎకరం చేనులో కలుపు తీసేందుకు వీలు పడుతోంది. యంత్రంతో కలుపు తీస్తున్న స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కిషన్‌ను అభినందించారు.