గ్రామ, మండల కమిటీలకు గైడ్‌లైన్స్ జారీ

దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పకడ్భందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జిల్లాలోని గ్రామ, మండల కమిటీలకు సూచనలు చేశారు. 30 రోజుల వరకూ కరోనా లక్షణాలు బయటపడకపోవడంతో ఖచ్చితంగా నిభందనలు పాటించాలన్నారు. విదేశాల నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు 30 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండేలా చొరవ చూపాలని కోరారు. సరైన అనుమతి […]

Update: 2020-04-10 05:38 GMT

దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పకడ్భందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జిల్లాలోని గ్రామ, మండల కమిటీలకు సూచనలు చేశారు. 30 రోజుల వరకూ కరోనా లక్షణాలు బయటపడకపోవడంతో ఖచ్చితంగా నిభందనలు పాటించాలన్నారు. విదేశాల నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు 30 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండేలా చొరవ చూపాలని కోరారు. సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారెవరినీ గ్రామాల్లోకి అనుమతించవద్దన్నారు. అదే గ్రామానికి చెందిన వారు అయినా కూడా ఊర్లోకి రానివ్వకుండా కట్టడి చేయాలని కలెక్టర్ తెలిపారు. అనుమతి తీసుకుని వచ్చిన వారిని కూడా మూడు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉంచాలన్నారు. గత వారం రోజుల్లో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి గురించి గ్రామస్థాయి కమిటీలతో సర్వే చేయించి వివరాలు తెలుసుకోవాలన్నారు. అనుమానిత వ్యక్తులు ఉన్నట్టయితే వెంటనే మండలస్థాయి కమిటీకి గ్రామ కమిటీలు సమాచారం ఇవ్వాలని కోరారు. అనుమానిత వ్యక్తులున్న ఇళ్ల చుట్టుపక్కల రోజుకు మూడు సార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేయించాలని, ప్రతి వ్యక్తి తప్పని సరిగా గుడ్డతో తయారు చేసిన మాస్కు ధరించే విధంగా చొరవ చూపాలని కృష్ణ భాస్కర్ ఆదేశించారు. మాస్కు ధరించకుండా బయటకు వచ్చిన వ్యక్తులకు జరిమానా విధిస్తామని కూడా ప్రచారం చేయాలని, మాస్కు లేకుండా రెండోసారి కనబడితే ఫైన్ విధించాలని కూడా ఆయన సూచించారు. స్థానికంగా బట్టలుకుట్టే వారితో రెండుపొరల మాస్కులు తయారు చేయించాలని, నిత్యావసర వస్తువులు, వైద్య అవసరాల కొరకు బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి అత్యవసరం అని భావిస్తే మాత్రమే గ్రామ పంచాయితీ అనుమతి పత్రం ఇవ్వాలన్నారు. ప్రతి రోజు సాయంత్రం గ్రామస్థాయి కమిటీతో సమావేశమై పరిస్థితిని సమీక్షించుకోవాలని ఆచన సూచించారు.

Tags: village and mandal committee, sircilla collector krishna bhasker guide lines release, carona, lockdown

Tags:    

Similar News