బాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం : వైద్యులు

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటివరకు సీరియస్‌గా ఉన్న బాలు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెన్నై ఎంజీఎం వైద్యులు చెబుతున్నారు. అయితే, ఐసీయూలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తుమన్నారు. ఆయనకు ఎక్మో సపోర్టు కూడా అందిస్తున్నట్లు వివరించారు. ఇవాళ ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేశాయి. బాలుకు ఎక్మో సపోర్టు సాయంతో వెంటిలేటర్ పై చికిత్స […]

Update: 2020-08-22 11:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటివరకు సీరియస్‌గా ఉన్న బాలు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెన్నై ఎంజీఎం వైద్యులు చెబుతున్నారు. అయితే, ఐసీయూలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తుమన్నారు. ఆయనకు ఎక్మో సపోర్టు కూడా అందిస్తున్నట్లు వివరించారు. ఇవాళ ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేశాయి.

బాలుకు ఎక్మో సపోర్టు సాయంతో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని, భిన్న వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని వివరించారు. అంతేకాకుండా, తమ వైద్య బృందం ఈ విషయంలో అంతర్జాతీయ వైద్య నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరుపుతోందన్నారు.

అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సపోర్టుతో చికిత్స అందించిన వైద్య నిపుణులతో ఎంజీఎం డాక్టర్లు మాట్లాడుతున్నారని ఆస్పత్రి బులెటిన్‌లో తెలిపింది. తాము బాలుకు అందిస్తున్న చికిత్స విధానంతో అంతర్జాతీయ వైద్య నిపుణులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైద్యులు ప్రకటించారు.

Tags:    

Similar News