షాకింగ్ ఘటన.. భర్త ఆత్మహత్యను వీడియో రికార్డ్ చేసిన భార్య

మహారాష్ట్రలోని థానేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-11-24 12:50 GMT

దిశ,వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని థానేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలంటే కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుంటూ.. సంసార జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. కానీ భర్తకు జీవితంలో అండగా నిలవాల్సిన భార్య ఏం చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు విషయంలోకి వెళితే.. భర్త(29) ఆత్మహత్య చేసుకుంటుండగా నిలువరించాల్సింది పోయి ఆ ఘటనను ఫోన్‌లో రికార్డు చేసిన భార్య(29) పై మహారాష్ట్ర థానే పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యాభర్తలిద్దరూ నిత్యం గొడవ పడేవారు. ఈ క్రమంలో నవంబర్ 20న ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉండి భర్తను కాపాడకుండా భార్య వీడియో రికార్డు చేసింది. దీంతో మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు భార్యపై కేసు నమోదు చేశారు.


Similar News