11భాషల్లో.. 40వేల పాటలు

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఏ గాయకుడు అందుకోలేనంతగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటల ప్రస్థానంలో దూసుకుపోయాడు. 11భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నాడు. పదాల మాదుర్యాన్ని గమనించి చేసే ఉచ్చారణ అతనిని పాట పండిత పామరులకు మరింత చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి చిత్రాలతో పాటు ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశవ్యాప్తంగా ఉర్రూతలూగించాయి. 40 సినిమాలకు […]

Update: 2020-09-25 02:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఏ గాయకుడు అందుకోలేనంతగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటల ప్రస్థానంలో దూసుకుపోయాడు. 11భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నాడు. పదాల మాదుర్యాన్ని గమనించి చేసే ఉచ్చారణ అతనిని పాట పండిత పామరులకు మరింత చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి చిత్రాలతో పాటు ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశవ్యాప్తంగా ఉర్రూతలూగించాయి. 40 సినిమాలకు మ్యూజిక్ అందించి తన కెరియర్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు

దశవతారం సినిమాలో 7పాత్రలకు డబ్బింగ్

ప్రతిరోజు సినిమా పాటలతో బిజీ షెడ్యూల్‌లో దూసుకెళ్తున్న క్రమంలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారాడు. కె. బాలచందర్‌ డైరెక్షన్‌లో వచ్చిన మన్మథ లీల తమిళ అనువాద చిత్రంలో డబ్బింగ్ ‌చెప్పాడు. ఆ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్, సల్మాన్‌ఖాన్, జెమిని గణేషన్, అర్జున్, రఘువరన్‌ లాంటి పెద్ద పెద్ద నటులకు గాత్రదానం చేశాడు. 2010లో కమల్‌హాసన్ హీరోగా వచ్చిన దశవతారం సినిమాలో 10 పాత్రల్లో 7పాత్రలకు బాల సుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వెంకటేశ్వరస్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రాలకు డబ్బింగ్ చెప్పగా.. ఈ రెండు చిత్రాలకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం వచ్చింది. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Tags:    

Similar News