తెలంగాణ తెచ్చినోళ్లు.. ఇచ్చినోల్లు ఇద్దరూ ఫెయిల్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన కేసీఆర్, ఇచ్చిన సోనియా గాంధీ ఇద్దరూ ఫెయిల్ అయ్యారని ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న అన్నారు. లోటస్ పాండ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం దొరల చేతిలో బందీ అయ్యిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. దొరల తెలంగాణ పోయి బడుగుల తెలంగాణ రావాలని, అది జరగాలంటే అందరూ రాజన్న బిడ్డ షర్మిలకు సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై దాడి చేస్తే […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన కేసీఆర్, ఇచ్చిన సోనియా గాంధీ ఇద్దరూ ఫెయిల్ అయ్యారని ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న అన్నారు. లోటస్ పాండ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం దొరల చేతిలో బందీ అయ్యిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. దొరల తెలంగాణ పోయి బడుగుల తెలంగాణ రావాలని, అది జరగాలంటే అందరూ రాజన్న బిడ్డ షర్మిలకు సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు.
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై దాడి చేస్తే ఊరుకోం..
ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై జరిగే దాడులకు ప్రతిదాడులు చేస్తామని ఏపూరి సోమన్న హెచ్చరించారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించిన ఆయనపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. ఒక అధికారిపై కులం, మతం పేరుతో జరిగే దాడిని షర్మిల పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 9న ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభకు కళాకారులను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.