మీ పెత్తనం వద్దే వద్దు.. నా లైఫ్ నా ఇష్టం : బ్రిట్నీ స్పీయర్స్

దిశ, ఫీచర్స్ : జీవితంలో ప్రతీ ఒక్కరు స్వేచ్ఛ కోరుకుంటారు. తమకు నచ్చినవిధంగా బతకాలని ఆశిస్తారు. కానీ గార్డియన్‌షిప్/కన్జర్వేటర్‌షిప్ పేరుతో ఇతరులు మన లైఫ్‌లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? పెద్దమనిషిగా మన మంచి కోరుకుంటే ఓకే కానీ, ప్రతి విషయంలోనూ ఫ్రీడమ్ లేకుండా చేస్తే.. అడల్ట్ అయినా సరే పెళ్లి, పిల్లల విషయంలో కనీస స్వతంత్రం ఇవ్వకపోతే.. నా లైఫ్‌ మీద నీ పెత్తనం ఏంటి? అని అడగాలనిపిస్తుంది కదా! ఇలాంటి ప్రశ్ననే పాపులర్ సెలబ్రిటీ […]

Update: 2021-06-26 22:07 GMT

దిశ, ఫీచర్స్ : జీవితంలో ప్రతీ ఒక్కరు స్వేచ్ఛ కోరుకుంటారు. తమకు నచ్చినవిధంగా బతకాలని ఆశిస్తారు. కానీ గార్డియన్‌షిప్/కన్జర్వేటర్‌షిప్ పేరుతో ఇతరులు మన లైఫ్‌లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? పెద్దమనిషిగా మన మంచి కోరుకుంటే ఓకే కానీ, ప్రతి విషయంలోనూ ఫ్రీడమ్ లేకుండా చేస్తే.. అడల్ట్ అయినా సరే పెళ్లి, పిల్లల విషయంలో కనీస స్వతంత్రం ఇవ్వకపోతే.. నా లైఫ్‌ మీద నీ పెత్తనం ఏంటి? అని అడగాలనిపిస్తుంది కదా! ఇలాంటి ప్రశ్ననే పాపులర్ సెలబ్రిటీ బ్రిట్నీ స్పియర్స్ తన తండ్రిని కోర్టు ద్వారా ప్రశ్నించింది. 13 ఏళ్లుగా తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఓపెన్ అయింది. 2008 -2021వరకు తన లైఫ్ తన కంట్రోల్‌లో లేకుండా ఇతరుల చేతిలో పెట్టిన కోర్టును ఇప్పటికైనా ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుందని అభ్యర్థించింది. ఈ క్రమంలోనే #FreeBritney పేరుతో అభిమానులు ఉద్యమానికి తెరతీయగా.. మిలియన్ డాలర్లకు అధిపతిరాలిగా ఉన్న బ్రిట్నీ అసలు ఎందుకు కన్జర్వేటర్‌షిప్ పొందాల్సి వచ్చింది? తన మెంటల్ కండిషన్ బాగాలేదని ప్రూవ్ చేసిన సందర్భాలేంటి? ఇన్నాళ్లుగా ఎలాంటి ట్రీట్మెంట్ లేదా తను క్యూర్ కాలేకపోయిందా? బిజినెస్ పరంగా ఎలాంటి లాభనష్టాలు చవిచూసింది? తనకు నిజంగానే టాక్సిక్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయా? కోర్టు సమకూర్చిన కన్జర్వేటర్‌షిప్ వీటిని నియంత్రించగలిగిందా?

‘కన్జర్వేటర్‌షిప్’ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో మానసికంగా ఆరోగ్యంగా లేకుండా, భారీ సంపాదన కలిగిన అడల్ట్‌ బాధ్యతలను తీసుకునేందుకు కోర్టు గార్డియన్‌గా ఓ వ్యక్తిని నియమించే విధానం. ఈ కన్జర్వేటర్.. ఫ్యామిలీ మెంబర్ లేక స్నేహితుడు లేక కోర్టు అపాయింటెడ్ ప్రొఫెషనల్ అయుండొచ్చు. ఈ వ్యక్తి.. పర్టిక్యులర్ అడల్ట్‌కు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ఆర్థిక వ్యవహారాలను నియంత్రించగలిగే హక్కు కలిగి ఉంటాడు. ఎవరిని కలవాలనే విషయం నుంచి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఆ వ్యక్తితో పిల్లలను కనొచ్చా లేదా? వంటి మ్యాటర్స్‌లోనూ తనదే ఫైనల్ డెసిషన్. ఒకవేళ కన్జర్వేటర్‌షిప్‌కు ఎండ్ కార్డ్ వేయాలంటే మాత్రం.. సదరు అడల్ట్ కోర్టును ఆశ్రయించి, తను మెంటల్‌గా హెల్తీగా ఉన్నానని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, కన్జర్వేటర్‌షిప్‌తో యునైటెడ్ స్టేట్స్‌లో మిలియన్ సంఖ్యలో అడల్ట్స్ ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, ఇలాంటి చట్టాన్ని తొలగిస్తేనే బాగుంటుందనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బ్రిట్నీ స్పియర్స్ తాజాగా తన కన్జర్వేటర్‌షిప్‌కు అంతం పలకాలి అంటూ కోర్టును బహిరంగంగా అభ్యర్థించగా ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అయింది.

బ్రిట్నీ స్పియర్స్.. కన్జర్వేటర్‌‌షిప్ స్టోరీ :

2008లో బ్రిట్నీ స్పియర్స్‌కు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనే విషయం పబ్లిక్‌గా ప్రూవ్ అయింది. 2004లో అలెన్ అలెగ్జాండర్‌ను పెళ్లి చేసుకుని అదే ఏడాది వదిలేసిన సింగర్.. ఇయర్ ఎండింగ్‌లో కెవిన్ ఫెడర్‌లైన్‌ను మ్యారేజ్ చేసుకుని 2008లో విడాకులు ఇచ్చేసింది. ఈ రిలేషన్‌‌షిప్స్ తనను మెంటల్‌గా డిస్టర్బ్ చేయగా.. 2008లో స్పియర్స్ తన కొడుకు సీన్‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని బెల్ట్ లేకుండా కారు నడిపి రచ్చరచ్చ చేసింది. ఆ తర్వాత గుండు చేయించుకుని గొడుగుతో ఓ ఫొటోగ్రాఫర్ కారు అద్దాలను ధ్వంసం చేసింది. దీంతో ఆందోళనలు తలెత్తగా.. తండ్రి జామీ స్పియర్స్ కోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ వేశాడు. బ్రిట్నీ తాత్కాలిక కన్జర్వేటర్‌షిప్‌ బాధ్యతలు తనకు అప్పగించాలని కోరాడు. దీనికి ఆమోదం తెలిపిన కోర్టు అప్పటి నుంచి తన ఎస్టేట్, పర్సనల్ బాధ్యతలను ఆమె తండ్రికి ఇచ్చేసి.. ఫైనాన్షియల్, బిజినెస్ డీల్స్ చూసుకునే రెస్పాన్సిబిలిటీస్‌ అటార్నీ ఆండ్రూ వాలెట్‌ చేతుల్లో పెట్టింది.

#FreeBritney మూమెంట్..

అయితే, కన్జర్వేటర్‌షిప్‌ను స్పియర్స్ అభిమానులు పాజిటివ్‌గా తీసుకోలేదు. ఇది తనను అన్ని రకాలుగా నియంత్రిస్తుందనే ఉద్దేశంతో ఫ్రీబ్రిట్నీ(#FreeBritney) మూమెంట్‌ను వెలుగులోకి తీసుకొచ్చారు. 2009లో ఓ ఫ్యాన్‌సైట్ ఈ ఉద్యమానికి తెరలేపగా సెలబ్రిటీలు సైతం మద్దతిచ్చారు. ‘బ్రిట్నీస్ గ్రామ్’ పేరుతో ఉన్న ఫ్యాన్ పోడ్‌కాస్ట్ 2019లో ఓ వాయిస్ మెయిల్ రిలీజ్ చేసింది. బ్రిట్నీ ఫోర్సబుల్‌గా మెంటల్ హెల్త్ ఫెసిలిటీకి వెళ్తుందని ఆరోపించారు. కానీ స్పియర్స్‌కు దగ్గరగా ఉన్న వారు మాత్రం.. తండ్రి ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తనిఖీ చేస్తుందే తప్ప.. తాను ఎలాంటి మెంటల్ హెల్త్ ఫెసిలిటీకి వెళ్లడం లేదని, మందులు వాడడం కూడా మానేసిందని వివరించారు. అయితే, ఈ విషయం బయటకొచ్చిన మూడు వారాల తరువాత స్పియర్స్.. ‘మీరు చదివిన, వింటున్న ప్రతిదాన్ని నమ్మవద్దు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇక 2021 ఫిబ్రవరిలో న్యూయార్క్ టైమ్స్ ‘ఫ్రేమింగ్ బ్రిట్నీ స్పియర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. కన్జర్వేటర్‌షిప్, తండ్రితో కోర్టులో యుద్ధం గురించి హైలెట్ చేస్తూ రూపొందించిన డాక్యుమెంటరీలో తన లైఫ్ లాంగ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, తనతో కలిసి పనిచేసిన లాయర్లు.. స్పియర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. దీంతో ఫ్రీబ్రిట్నీ మూమెంట్ మరోసారి తెరమీదకు రాగా.. అభిమానులు, తన ప్రజంట్ బాయ్ ఫ్రెండ్ సామ్ అస్ఘరీ తనకు సపోర్ట్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.

ఇన్‌క్రెడిబుల్ గ్రోత్ ఇన్ కెరియర్..

అయితే, కన్జర్వేటర్‌షిప్ ఇంపోజ్ చేశాకే స్పియర్స్ కెరియర్‌లో ఇన్‌క్రెడిబుల్ గ్రోత్ కనిపించిందని రిపోర్టులు చెప్తున్నాయి. 2019 వరకు ప్రతీ రెండు మూడేళ్లకోసారి ఆల్బమ్ రిలీజ్ చేస్తున్న స్పియర్స్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించిందని తెలుస్తోంది. లాస్ వెగస్ రివ్యూ జర్నల్ ప్రకారం తన లాస్ట్ పర్ఫార్మెన్స్ 1.1 మిలియన్ డాలర్లు గ్రాస్ చేయగా.. 2018లో స్పియర్స్ ‘పీస్ ఆఫ్ మి టూర్’ 54.6 మిలియన్ డాలర్లు గ్రాస్ చేసినట్లు సమాచారం. ఈ సమయంలోనే స్పియర్స్.. క్లాతింగ్ అండ్ పర్ఫ్యూమ్ లైన్స్ లాంచ్ చేయడంతో పాటు లగ్జరీ ఫ్యాషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. అంతేకాదు ‘ది ఎక్స్ ఫ్యాక్టర్’ షో జడ్జ్‌గాను వ్యవహరించింది. ఈ క్రమంలో ఓ వైపు అభిమానులు స్పియర్స్‌కు ఫ్రీడమ్ ఇవ్వాలని కోరుతుంటే.. సన్నిహితులు మాత్రం కన్జర్వేటర్‌షిప్‌లో ఉన్న సమయంలోనే తను ఆర్థికంగా, కెరియర్‌ పరంగా ఎదిగిందని చెప్తున్నారు.

కోర్టు హియరింగ్స్..

మే 2019లో స్పియర్స్.. కన్జర్వేటర్‌షిప్‌ను ఎండ్ చేయడాన్ని పరిశీలనలోకి తీసుకోవాలని కోరింది. సెప్టెంబర్‌లో జరిగిన రెండో విచారణలో తనను తాత్కాలికంగా కన్జర్వేటర్‌గా తొలగించాలని తండ్రి జామీ కోరగా బ్రిట్నీ స్పియర్స్‌కు కేర్ మేనేజర్‌ను నియమించింది కోర్టు. ఆ తర్వాత జామీ.. #ఫ్రీ బ్రిట్నీ ఉద్యమానికి మూలం అయిన బ్రిట్నీ బ్లాగర్ ఆంథోనీ ఎలియాపై విజయం సాధించారు. తనకు వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేశారని ఆరోపించగా వారిపై సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో తల్లి లినీ స్పియర్స్ కన్జర్వేటర్‌షిప్‌లో ఇన్వాల్వ్ అయ్యేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక 2020లో తండ్రి గార్డియన్‌షిప్ రెండు సార్లు పొడిగించబడగా.. ఆగస్టులో తండ్రిని తన ఎస్టేట్ సోల్ కన్జర్వేటర్‌గా తొలగించాలని రిక్వెస్ట్ చేసింది. కానీ ఫిబ్రవరి1, 2021వరకు కొనసాగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే నెలలో స్పియర్స్ సిస్టర్ జామీ లిన్ స్పియర్స్ సీక్రెట్‌గా ట్రస్టీగా జాయిన్ అయిందని కోర్టు డాక్యుమెంట్స్ రివీల్ చేయగా.. బ్రిట్నీ ఫైనాన్షియల్ ఇష్యూస్‌ను నియంత్రించేందుకు కోర్టును ఆశ్రయించిందని తెలుస్తోంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో జామీని కన్జర్వేటర్‌గా తొలగించాలని స్పియర్స్ అటార్నీ కోర్టును కోరిన లాభం లేకుండా పోయింది. నవంబర్‌లో బిజినెస్ మేనేజర్ రాజీనామా చేసినట్లు తెలుసుకున్న స్పియర్స్ న్యాయవాది వెంటనే జామీ స్పియర్స్‌ను కూడా తొలగించాలని రిక్వెస్ట్ చేశారు. 2021 ఫిబ్రవరిలో స్పియర్స్ తన ఎస్టేట్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో తలదూర్చకూడదన్న తండ్రి వాదనను ఫైనల్‌గా తిరస్కరించింది కోర్టు. కానీ కన్జర్వేటర్‌షిప్‌ను మాత్రం కొనసాగిస్తూనే ఉంది.

అబ్యూజివ్ కన్జర్వేటర్‌షిప్..

స్పియర్స్ తన కన్జర్వేటర్‌షిప్‌పై చాలాకాలంగా బహిరంగంగా నిశ్శబ్దంగా ఉండగా ఎట్టకేలకు జూన్ 23న ఆమె కన్జర్వేటర్‌షిప్‌ను ముగించాలని అధికారికంగా కోర్టును కోరింది. 50 మిలియన్ డాలర్లకుపైగా సంపాదనను కలిగిన బ్రిట్నీ.. తన జీవితం మీద పూర్తినియంత్రణ తనదే అయి ఉండాలని అభ్యర్థించింది. 13 ఏళ్లుగా ఈ నరకంలో ఉంటున్నానని.. తను ఎవరిని కలవాలి? ఎవరితో మాట్లాడాలి? అనే విషయాలతో పాటు బర్త్ కంట్రోల్ కూడా తన తండ్రే చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. ఈ వివాదాస్పద కన్జర్వేటర్‌షిప్ తనకు మంచికన్నా ఎక్కువగా హాని కలిగిస్తోందని తెలిపింది. మెడికల్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా కన్జర్వేటర్‌షిప్‌ను ముగించాలన్న స్పియర్స్.. తన పిల్లలను కూడా కలవలేకపోతున్నానని బాధపడింది. మోడల్ సామ్ అస్ఘరితో డేటింగ్ విషయంలోనూ నియంత్రణ తప్పడం లేదన్న ఆమె.. తన తండ్రిని జైలుకు పంపించి, పర్సనల్-ఫైనాన్షియల్ ఇష్యూస్‌పై పూర్తి అధికారాలు తనకే ఇవ్వాలని కోరింది.

Tags:    

Similar News