మెసేజెస్‌లో తేడాలు.. టాక్సిక్ రిలేషన్‌షిప్‌కు సంకేతాలు
దిశ, ఫీచర్స్ : ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు విషపూరితంగా మారినప్పుడు, ఇద్దరినీ సమానంగా ప్రభావితం చేస్తాయి. ఎదుటి వ్యక్తి పట్ల రిలేషన్‌లో తేడా అనిపిస్తే.. దీర్ఘకాలికంగా కలిగే ఎమోషన్, అనుభవించే ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒంటరిగా, విచారంగా గడుపుతూ యాక్టివ్‌నెస్ కోల్పోయిన ఫీలింగ్స్ ఎదుర్కొంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని రకాల శారీరక లేదా మానసిక చర్యలకు మాత్రమే పరిమితం కావు. వారితో మెసేజెస్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యే విధానంలోనూ అది ప్రతిబింబిస్తుంది. అంతకుముందులా కాకుండా […]
దిశ, ఫీచర్స్ : ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు విషపూరితంగా మారినప్పుడు, ఇద్దరినీ సమానంగా ప్రభావితం చేస్తాయి. ఎదుటి వ్యక్తి పట్ల రిలేషన్‌లో తేడా అనిపిస్తే.. దీర్ఘకాలికంగా కలిగే ఎమోషన్, అనుభవించే ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒంటరిగా, విచారంగా గడుపుతూ యాక్టివ్‌నెస్ కోల్పోయిన ఫీలింగ్స్ ఎదుర్కొంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని రకాల శారీరక లేదా మానసిక చర్యలకు మాత్రమే పరిమితం కావు. వారితో మెసేజెస్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యే విధానంలోనూ అది ప్రతిబింబిస్తుంది. అంతకుముందులా కాకుండా ఒక్కో పదాన్ని ఆలోచించి మరీ టైప్ చేస్తుంటారు.. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం.
రూల్స్‌కు కట్టుబడి టెక్ట్స్ మెసేజెస్..
నార్మల్ రిలేషన్‌షిప్స్ మధ్య టెక్ట్స్ మెసేజెస్ సహజమే. కానీ టాక్సిక్ రిలేషన్స్ విషయంలో.. పార్ట్‌నర్‌కు మెసేజ్ చేయాలంటే కట్టుదిట్టమైన వ్యూహాలు అమలుచేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ ప్రాసెస్‌ను ఇంచుమించు ఒక గేమ్‌గా భావించవచ్చు. అందువల్ల, భాగస్వామికి మెసేజ్ చేసేటప్పుడు ఇలాంటి భావనలు ఎదుర్కొన్నట్టయితే బంధం బలహీనపడిందనే అంచనాకు రావొచ్చు. ఎందుకంటే మెసేజ్ అనేది కమ్యూనికేషన్ కోసమే తప్ప, మైండ్ గేమ్ ఆడేందుకు కాదు.
రిప్లయ్ ఇచ్చేలా ఒత్తిడికి గురిచేస్తారు..
మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫోన్ మోగిన వెంటనే స్పందించాలని మీ భాగస్వామి భావిస్తున్నారంటే, మీరు విషపూరితమైన వ్యక్తితో ఉన్నట్టే లెక్క. ఎవరికైనా సొంత జీవితం ఉంటుంది. ఎప్పుడూ ఫోన్‌ను పట్టుకునే ఉండటం సాధ్యం కాదు. అలా కాకుండా మీరు వెంటనే సమాధానం ఇవ్వాలని ఎదుటివారు ఆశిస్తున్నారంటే.. మీ సమయం, కెరీర్‌తో పాటు పర్సనల్ స్పేస్‌ను వారు గౌరవించడం లేదనే అర్థం.
కావాలనే పట్టించుకోరు..
టాక్సిక్ పార్ట్‌నర్స్ ఉద్దేశపూర్వకంగానే రిప్లయ్ ఇవ్వకుండా ప్రతీకారం తీర్చుకోవడం కామన్. ఇలాంటి ప్రవర్తనను మీరు అంతకుముందు ఫేస్ చేసి ఉండరు. వారు మిమ్మల్ని పట్టించుకోకపోవడంతో పాటు ఫోన్‌లో సైలెంట్‌గా ఉండటం ద్వారా ఒకరకమైన కల్పన, డ్రామాను క్రియేట్ చేయొచ్చు. అలాంటి ప్రవర్తన అలవాటుగా మారితే, మీరు విషపూరిత భాగస్వామితో ఉన్నట్టే.
కంటిన్యుయస్‌గా మెసేజ్ చేస్తారు..
మీరు బిజీగా, రిప్లయ్ ఇవ్వలేని సందర్భంలో ఉన్నప్పడు.. భాగస్వామి నుంచి కంటిన్యుయస్‌గా మెసేజెస్ వస్తుంటే కచ్చితంగా ఆ బంధానికి బీటలు వారినట్టే. క్రమంగా ఇది మీలో ఒత్తిడి, ఆందోళన కలిగిస్తే.. భాగస్వామిలో విపరీతమైన కోపం, నిరాశకు దారితీస్తుంది. అందుకే ఇది ఎంతమాత్రం ఆరోగ్యకరం కాదు.
డిజిటల్ మానిప్యులేషన్..
టాక్సిక్ పార్టనర్.. మీపై నియంత్రణ పెంచుకునేందుకు మీ స్మార్ట్‌ఫోన్, ఇతర పరికరాలను మానిప్యులేట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇందుకోసం కాంటాక్ట్ లిస్ట్ నుంచి కొన్ని పేర్లతో పాటు మీ ఇన్‌బాక్స్ నుంచి మెసేజెస్, గ్యాలరీ నుంచి మీడియాను తొలగించవచ్చు లేదా మీలాగే నటిస్తూ ఇతరులు పంపిన సందేశాలకు రిప్లై ఇవ్వవచ్చు. అంతేకాదు తామేం చేయలేదని మిమ్మల్ని కన్విన్స్ చేయవచ్చు.
మీ డివైస్‌ను స్వాధీనం చేసుకుంటారు..
ఫోన్‌కు అడిక్ట్ అయ్యారని ఆరోపిస్తూ మీ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ విషయంలో వారు కూడా ఫీల్ అయినట్టు కనిపించినా, ప్రేమించినా లేదా బాధించినా.. అవన్నీ మిమ్మల్ని నియంత్రించడానికి, ఒంటరి చేయడానికి అమలుచేసే వ్యూహాలే. ఫైనల్‌గా వారు కోరుకునేది ఇతరులతో మీ కమ్యూనికేషన్ అడ్డుకోవడమే.