ఓం నమ:శివాయ

పచ్చని అడవిలా పారేటి ఏరు లా కొండల్లో నెలవైన ఈశ్వరా మా బతుకుల్లో కొలువైన పరమేశ్వరా మాకెంతో ఇష్టుడవు ప్రపంచపు తొలి కమ్యూనిస్టువు ఆడ,మగ ఏకమన్న అర్థనారీశ్వరుడవు ఆదిబిక్షువు జీవకోటి రక్షకుడవు కోటీశ్వరులైనా కూటికి లేనోల్లైనా అదృష్టవంతులైనా దురదృష్టవంతులైనా అందరి ఆఖరి మజిలీ అదే అన్నవ్ అక్కడే కొలువైనిలుచున్నవ్ సమధర్మ సూత్ర ధారి అసలు, సిసలు ప్రజాస్వామ్యావాది నీవే నయా..ఓ పార్వతీపతీ… సింధూ నాగరికతలో చిందేసి నదీ లోయల్లో నడయాడి అనంత జీవరాశుల దేవుడైనవ్ వేముల వాడ […]

Update: 2020-02-20 05:07 GMT

పచ్చని అడవిలా
పారేటి ఏరు లా
కొండల్లో నెలవైన ఈశ్వరా
మా బతుకుల్లో కొలువైన పరమేశ్వరా
మాకెంతో ఇష్టుడవు
ప్రపంచపు తొలి కమ్యూనిస్టువు
ఆడ,మగ ఏకమన్న అర్థనారీశ్వరుడవు
ఆదిబిక్షువు
జీవకోటి రక్షకుడవు

కోటీశ్వరులైనా
కూటికి లేనోల్లైనా
అదృష్టవంతులైనా
దురదృష్టవంతులైనా
అందరి ఆఖరి మజిలీ అదే అన్నవ్
అక్కడే కొలువైనిలుచున్నవ్
సమధర్మ సూత్ర ధారి
అసలు, సిసలు ప్రజాస్వామ్యావాది
నీవే నయా..ఓ పార్వతీపతీ…

సింధూ నాగరికతలో చిందేసి
నదీ లోయల్లో నడయాడి
అనంత జీవరాశుల దేవుడైనవ్
వేముల వాడ రాజన్న
కొమురవెల్లి మల్లన్న
యాంగటి బసవన్న
శ్రీశైలం మల్లన్న
ఎన్ని పేర్లు, ఎన్ని తీర్లు
శివా…. నీవు లేనిదెక్కడ…
మా స్వరాన నీవే
నరనరనా నీవే…
మా సర్వస్వమూ నీవేయా బసవేశ్వరా….

అత్తరు, హంగు, రంగుల లోకంలో మునిగినప్పుడు
పట్టువస్త్రాలు, హంసతూలికా తల్పాలపై భ్రమసినప్పుడు
అధికార, ధిక్కారాల కోసం బరితెగించినప్పుడు
వనితా, విత్తాల కోసం కత్తులు దూసుకున్నప్పుడు
హంగు, ఆర్భాల కోసం అర్రులు చాచినప్పుడు…..
మనిషి…. మట్టి…. ఒక్కటేనని… రుజువు చేస్తున్నసర్వేశ్వరా
తనువెల్ల నిజమై నిలిచినవ్
ఈ జగమంతా నీవై వెలసినవ్
ఆది నీవే…అంతం.. నీవే.. అంతా నీవే…

ఓం నమ:శివాయా…

– బుచ్చన్న గొర్ల

Tags:    

Similar News