ఇకపై టీచర్లుగా అంగన్వాడీ కార్యకర్తలు

దిశ, ఏపీ బ్యూరో: ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు ప్రీస్కూల్ ద్వారా టీచర్లుగా మారుతారని వారి గౌరవం మరింత పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మార్కెట్ యార్డులో సోమవారం నిర్వహించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పౌష్టికాహార మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు ఏడాదికి దాదాపు రూ.1,840 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని తెలిపారు. ఈ […]

Update: 2021-09-13 11:14 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు ప్రీస్కూల్ ద్వారా టీచర్లుగా మారుతారని వారి గౌరవం మరింత పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మార్కెట్ యార్డులో సోమవారం నిర్వహించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పౌష్టికాహార మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు ఏడాదికి దాదాపు రూ.1,840 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని తెలిపారు. ఈ నిధులు కేవలం గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడానికేనని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాలు ఇచ్చే పౌష్టికాహారానికి..వైసీపీ ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారానికి చాలా తేడా ఉందన్నారు.

సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పౌష్టికాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో అంగన్వాడీ టీచర్లు టీచర్లుగా కొనసాగలేదని కానీ జగనన్న ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను టీచర్లుగా తయారు చేసి వారికి సమున్నత స్థానం కల్పిస్తుందని అన్నారు. ప్రీస్కూల్‌లు ఏర్పాటు చేయడం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలను తీసేస్తారని తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ పివి సతీష్, పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News