వ‌రి సాగు వ‌ద్దంటే వ‌ద్దు..: కలెక్టర్ కీలక ఆదేశాలు

దిశ‌, అందోల్ః రైతులు యాసంగి సీజ‌న్‌లో ప్రత్యామ్నాయ పంట‌ల సాగుపై దృష్టి సారించాల‌ని, వ‌రి సాగు వ‌ద్దంటే వ‌ద్దని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ‌ద‌ని, త‌ద్వారా వ‌రి సాగు చేసే రైతుల‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని, తిన‌డానికి స‌రిప‌డ ధాన్యాన్ని పండించుకొవ‌చ్చున‌ని ఆయ‌న తెలిపారు. సోమ‌వారం అందోలు, చౌట‌కూర్ మండ‌లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడిన ఆయన ప్రత్యామ్నాయ పంటల సాగుపై […]

Update: 2021-12-06 07:29 GMT

దిశ‌, అందోల్ః రైతులు యాసంగి సీజ‌న్‌లో ప్రత్యామ్నాయ పంట‌ల సాగుపై దృష్టి సారించాల‌ని, వ‌రి సాగు వ‌ద్దంటే వ‌ద్దని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ‌ద‌ని, త‌ద్వారా వ‌రి సాగు చేసే రైతుల‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని, తిన‌డానికి స‌రిప‌డ ధాన్యాన్ని పండించుకొవ‌చ్చున‌ని ఆయ‌న తెలిపారు. సోమ‌వారం అందోలు, చౌట‌కూర్ మండ‌లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడిన ఆయన ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. యాసంగిలో కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని తెలిపారు. రైతులు తమ సొంత అవసరానికి, మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న మేర‌కే ధాన్యం సాగు చేసుకోవాలన్నారు.

వరికి ప్రత్యామ్నాయంగా లాభదాయకమైన ఆరుతడి పంటలను వేసుకోవాలని, ఆయా పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు సజావుగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని, రైతుల ఖాతాల్లో 72 గంటల్లో డబ్బులు పడుతున్నాయన్నారు. కేంద్రాల వ‌ద్దనున్న రైతుల‌తో యాసంగీ పంట‌ల సాగు వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాసంగిలో ప్రత్యామ్నాయ పంట‌ల సాగుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయ‌న అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు, ఏడీఏ అరుణ‌, రైతు స‌మ‌న్వ స‌మితి అధ్యక్షుడు అశోక్‌, త‌హ‌శీల్ధార్‌లు అశోక్‌, కిష్టయ్యతో పాటు త‌దిత‌రులు పాల్గోన్నారు.

Tags:    

Similar News