రంగనాయకసాగర్ వీక్షణకు రావొద్దు: సీపీ డేవిస్

దిశ, మెదక్: కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తూ 34 రోజుల నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ డి జోయల్ డేవిస్ అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మే 7 వరకు పోలీసుల సూచనలు, సలహాలు పాటించి, తమకు మద్దతు తెలపాలని సూచించారు. ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసే […]

Update: 2020-04-25 10:04 GMT

దిశ, మెదక్: కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తూ 34 రోజుల నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ డి జోయల్ డేవిస్ అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మే 7 వరకు పోలీసుల సూచనలు, సలహాలు పాటించి, తమకు మద్దతు తెలపాలని సూచించారు. ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసే వరకు రంగనాయకసాగర్ ప్రాజెక్టు సందర్శనకు ప్రజలు ఎవరూ రావొద్దన్నారు. ప్రస్తుతం ఎవరికీ అనుమతి ఇచ్చేది లేదన్నారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలు ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, మెడికల్ షాపులు తెరిచే ఉంటాయన్నారు.

Tags: carona, lockdown, comissioner joyal davies, appriciate police team members

Tags:    

Similar News