రెండేళ్ల గ్యాప్‌తో పుట్టిన కవలలు.. ఇంటర్నెట్‌లో స్టోరీ వైరల్
దిశ, ఫీచర్స్: సాధారణంగా తల్లి గర్భం నుంచి నిమిషాల వ్యవధిలో పుట్టిన వారిని కవలలుగా పరిగణిస్తుంటాం. కానీ, తొమ్మిది నెలలు ఒకే గర్భంలో ఉండి రెండేళ్ల గ్యాప్‌తో పుట్టిన ట్విన్స్ కూడా ఉంటారంటే వినేందుకు ఆశ్చర్యాన్ని, అసలు ఎలా సాధ్యమనే సందేహాన్ని కలిగిస్తుంది కదా.. నమ్మశక్యంగా లేని ఈ మెడికల్ మిరాకిల్ ఎలా? ఎక్కడ? జరిగిందో మీరూ తెలుసుకోండి. ఆస్ట్రేలియాలోని టాస్మానియాకు చెందిన సిబ్లింగ్స్ సారా సార్జెంట్, విల్ సార్జెంట్ రెండేళ్ల తేడాతో జన్మించినా.. వారు కవలలే […]
దిశ, ఫీచర్స్: సాధారణంగా తల్లి గర్భం నుంచి నిమిషాల వ్యవధిలో పుట్టిన వారిని కవలలుగా పరిగణిస్తుంటాం. కానీ, తొమ్మిది నెలలు ఒకే గర్భంలో ఉండి రెండేళ్ల గ్యాప్‌తో పుట్టిన ట్విన్స్ కూడా ఉంటారంటే వినేందుకు ఆశ్చర్యాన్ని, అసలు ఎలా సాధ్యమనే సందేహాన్ని కలిగిస్తుంది కదా.. నమ్మశక్యంగా లేని ఈ మెడికల్ మిరాకిల్ ఎలా? ఎక్కడ? జరిగిందో మీరూ తెలుసుకోండి.
ఆస్ట్రేలియాలోని టాస్మానియాకు చెందిన సిబ్లింగ్స్ సారా సార్జెంట్, విల్ సార్జెంట్ రెండేళ్ల తేడాతో జన్మించినా.. వారు కవలలే అని తెలియడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారారు. ప్రస్తుతం 18 ఏళ్ల వయసున్న సారాకు రెండేళ్లు పెద్దవాడైన ‘విల్’ తను కవల సోదరుడు అనే విషయం తెలియదు. అయితే ఈ సీక్రెట్‌ను తల్లిదండ్రులు ఆమెకు చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ఇక ఈ కవలలు ఒకే బ్యాచ్‌కు చెందిన పిండాల నుంచి IVF ప్రక్రియ ద్వారా ఒకే రోజున ఫలదీకరణం కాబడ్డారు. కానీ ఫలదీకరణం చెందిన ‘విల్’ పిండం మాత్రమే తల్లి గర్భంలో ఇంప్లాంట్ చేయబడగా.. సారాను 18 నెలల పాటు ఫ్రీజర్‌లో ఉంచారు. ఈ విషయాన్ని సారా టిక్ టాక్‌లో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చిన ఈ అద్భుతమైన కవలల స్టోరీ.. మిలియన్ల వ్యూ్స్‌తో వైరల్ అయింది.
‘నా పేరెంట్స్ IVF ద్వారా మాకు జన్మనిచ్చారు. ప్రతీ IVF సైకిల్‌లో అమ్మ చాలా అండాలను ఉత్పత్తి చేసింది. అన్ని అండాలను ఫలదీకరణం చేయడానికి ప్రయత్నించిన క్లినిక్.. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటంతో ముందుగా రెండు బలమైన పిండాలను ఉపయోగించాలనుకున్నారు. వీటిలో ఒక పిండాన్ని తల్లి గర్భంలో ఇంప్లాంట్ చేయగా నా సోదరుడు జన్మించాడు. నా పిండాన్ని ఫ్యూచర్‌లో ఇంప్లాంట్ చేసుకునేందుకు ఫ్రీజ్ చేశారు. అలా నా సోదరుడు జన్మించిన 12 నెలల తర్వాత జనవరి 2001లో నేను డీఫ్రాస్ట్ చేయబడి, తల్లి గర్భంలో ఇంప్లాంట్ చేయబడ్డాను. అయితే ఒకరోజు స్కూ్‌ల్‌కు వెళ్తున్నప్పుడు నన్ను దత్తత తీసుకున్నారా? అని మా తండ్రిని సరదాగా అడిగాను. దీంతో ఆయన కాదని చెబుతూ, ఈ సీక్రెట్‌ను బయటపెట్టాడు’ అని ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతున్న సారా తెలిపింది.