ఎస్సై పట్టుబడితే సీక్రెట్టేగా?

దిశ ఏపీ బ్యూరో: తప్పు చేస్తూ ఎవరైనా పట్టుబడితే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, వారిని న్యాయస్థానం, మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టడం సాధారణంగా జరుగుతుంటుంది. మరి పేకాట ఆడుతూ పోలీసే పట్టుబడితే… అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కరోనా వైరస్ నాలుగో లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో గుంటూరు జిల్లా నిజాంపట్నం తీరప్రాంతంలో పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు దాడి చేశారు. ఊహించని విధంగా అక్కడ ఎస్సై, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబడ్డారు. […]

Update: 2020-05-23 06:49 GMT

దిశ ఏపీ బ్యూరో: తప్పు చేస్తూ ఎవరైనా పట్టుబడితే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, వారిని న్యాయస్థానం, మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టడం సాధారణంగా జరుగుతుంటుంది. మరి పేకాట ఆడుతూ పోలీసే పట్టుబడితే… అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కరోనా వైరస్ నాలుగో లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో గుంటూరు జిల్లా నిజాంపట్నం తీరప్రాంతంలో పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు దాడి చేశారు. ఊహించని విధంగా అక్కడ ఎస్సై, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబడ్డారు. దీంతో పై నుంచి ఒత్తిడి నేపథ్యంలో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News