ఏం జరిగింది.. పురుగుల మందు తాగిన ఎస్సై, కానిస్టేబుల్
దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు పోలీసులు పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. చండూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రావణి, అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా రవీంద్ర ఆత్మహత్యకు యత్నించారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో కనిపించిన వీరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇద్దరూ కలిసే పురుగుల మందు ఎందుకు తాగారు. ఇంతకీ అసలు విషయం ఏంటనేది […]
దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు పోలీసులు పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. చండూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రావణి, అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా రవీంద్ర ఆత్మహత్యకు యత్నించారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో కనిపించిన వీరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇద్దరూ కలిసే పురుగుల మందు ఎందుకు తాగారు. ఇంతకీ అసలు విషయం ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.