ఈ ఖాకీ మాములోడు కాదు..రిటైర్మెంట్ రోజు కూడా
దిశ, నల్లగొండ: కరోనా దెబ్బకు ప్రజలందరూ ఇళ్లల్లో ఉండాల్సినా పరిస్థితి వస్తే.. పోలీసులకు మాత్రం సెలవులు లేకుండా బయటే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.నిజానికి వారు లేకపోతే ఈలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ రూపురేఖలే మారిపోతాయి.ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే..ఓ ఎస్ఐకి ఈ రోజు(మంగళవారం) ఉాద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయినా కూడా అతను లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి వచ్చి వైరస్ బారిన పడుకుండా సిన్సియర్‌గా డ్యూటీ చేస్తున్నాడు. ఆయనే ఎస్ఐ అబ్దుల్లా.. ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా […]
దిశ, నల్లగొండ:
కరోనా దెబ్బకు ప్రజలందరూ ఇళ్లల్లో ఉండాల్సినా పరిస్థితి వస్తే.. పోలీసులకు మాత్రం సెలవులు లేకుండా బయటే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.నిజానికి వారు లేకపోతే ఈలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ రూపురేఖలే మారిపోతాయి.ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే..ఓ ఎస్ఐకి ఈ రోజు(మంగళవారం) ఉాద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయినా కూడా అతను లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి వచ్చి వైరస్ బారిన పడుకుండా సిన్సియర్‌గా డ్యూటీ చేస్తున్నాడు.
ఆయనే ఎస్ఐ అబ్దుల్లా.. ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.వివరాల్లోకి వెళితే..సూర్యాపేట టౌన్ స్పెషల్ బ్రాంచ్‌లో ఎస్ఐగా షేక్ అబ్దుల్లా విధులు నిర్వహిస్తున్నారు. 1983లో తన 21ఏటనే కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. 2010లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2013లో ఏఎస్ఐగా, 2018లో ఎస్ఐగా , ఉమ్మడి జిల్లాలోని 13పోలీసు స్టేషన్లలో 37ఏండ్లుగా డ్యూటీ చేశారు. ఆయనకు అధికారికంగా 100రోజులు సెలవులు ఉన్నాయి. వాటిని ఏ మాత్రం వాడుకోకుండా విధులు నిర్వర్తించారు. రిటైర్మెంట్ రోజుకు 15రోజులు ముందుగానే సెలవు పెట్టుకోవచ్చు. కానీ, వాటిని అబ్దుల్లా ఉపయోగించుకోలేదు. చివరి రోజు కూడా జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ సెంటర్‌లో డ్యూటీ చేస్తున్నారు. రోగులకు వైద్యం అందించే డాక్టర్లు కూడా వైరస్ బారిన పడి చనిపోతున్నారు. అలాంటి మమమ్మారికి సైతం భయపడకుండా పోలీసులు సమాజంలో బాధ్యతగా పనిచేస్తున్నారు. అందులోనూ అబ్దుల్లా లాంటి వారు చివరి రోజు వరకు సేవలు అందించడం అంటే మాములు విషయం కాదు.ఉద్యోగ విరమణ కదా ఎందుకు డ్యూటీ చేస్తున్నారని ఆయన్ను అడిగితే.. తాను విధులు నిర్వహించే చోటనే విరమణ పొందాలనుకుంటున్న అని చెప్పడం వృత్తి పట్ల అతనికి ఉన్ననిబద్ధతను తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు.
Tags: carona, job retirement day, lockdown duty, nalgonda, si abdullah