సర్పంచ్‌కి షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే..?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఈ నెల 18 లోగా అవెన్యూ ప్లాంటేషన్ పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సర్పంచులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి, భూంపల్లి, గాంధారి మండలం మాదవ పల్లి, గుడ్మెట్, గాంధారి, తిమ్మాపూర్, పెద్ద పోతంగల్ గ్రామ శివారులో ఆరవ విడత హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు నాటడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాధవపల్లి సర్పంచి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఈ నెల 18 లోగా అవెన్యూ ప్లాంటేషన్ పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సర్పంచులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి, భూంపల్లి, గాంధారి మండలం మాదవ పల్లి, గుడ్మెట్, గాంధారి, తిమ్మాపూర్, పెద్ద పోతంగల్ గ్రామ శివారులో ఆరవ విడత హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు నాటడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాధవపల్లి సర్పంచి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పద్మాజివాడి, భూంపల్లి, మదవపల్లి శివారులో కొన్ని చోట్ల మూడు వరుసలలో మొక్కలు నాటాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. ఆర్ అండ్ బి రోడ్డుకిరువైపులా రైతులు ఆక్రమించిన స్థలంలో మామిడి, దానిమ్మ, చింత వంటి మొక్కలు రైతులతో నాటించాలని పేర్కొన్నారు.