పాత మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత.. జూడాలపై ఒత్తిడి

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న తొమ్మిది పాత మెడికల్​ కాలేజీల్లోనూ స్టాఫ్ ​కొరత వేధిస్తున్నది. గాంధీ, ఉస్మానియా, కాకతీయ వరంగల్​, ఆదిలాబాద్​​, నిజామాబాద్​, మహబూబ్​నగర్ ​, సిద్ధిపేట్​, నల్గొండ, సూర్యాపేట్​ కాలేజీల్లో అసిస్టెంట్​ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వీటికి అనుసంధానంగా ఉన్న టీచింగ్​ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. టీవీవీవీ, డీఎంఈ పరిధిలో సుమారు 1,185 అసిస్టెంట్​  ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత […]

Update: 2021-12-11 18:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న తొమ్మిది పాత మెడికల్​ కాలేజీల్లోనూ స్టాఫ్ ​కొరత వేధిస్తున్నది. గాంధీ, ఉస్మానియా, కాకతీయ వరంగల్​, ఆదిలాబాద్​​, నిజామాబాద్​, మహబూబ్​నగర్ ​, సిద్ధిపేట్​, నల్గొండ, సూర్యాపేట్​ కాలేజీల్లో అసిస్టెంట్​ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వీటికి అనుసంధానంగా ఉన్న టీచింగ్​ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. టీవీవీవీ, డీఎంఈ పరిధిలో సుమారు 1,185 అసిస్టెంట్​ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త మెడికల్​ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెబుతున్న సర్కార్​, పాత కాలేజీల్లో స్టాఫ్​ కొరతను అధిగమించే చర్యలు తీసుకోవడం లేదు.

ఈ క్రమంలో టీచింగ్​ ఆసుపత్రుల్లో ట్రీట్​మెంట్​ ఆలస్యమవడమే కాకుండా, జూనియర్​ డాక్టర్లపై ఒత్తిడి పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే అసిస్టెంట్ ​ ప్రొఫెసర్లు, టీచింగ్​ ఫ్యాకల్టీని నియమించాలని జూడాలు సర్కార్​ను కోరారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావుకు వినతి పత్రం అందించారు.

వర్క్​ ప్రెజర్​ పెరిగింది..డా. కార్తీక్​గాంధీ, జూనియర్​ డాక్టర్

ప్రభుత్వాసుపత్రుల్లో అసిస్టెంట్​ ప్రొఫెసర్లు లేక ఇబ్బందులు వస్తున్నాయి. జూడాలకు సమస్యలు వస్తున్నాయి. స్టాఫ్​ కొరతతో సరైన సమయంలో రోగులకు వైద్యం అందించలేకపోతున్నాం. దీంతో క్యాలెండర్​ ఇయర్​ ప్రకటించి రెగ్యులర్​ విధానంలో వెంటనే పోస్టులు భర్తీ చేయాలి. దీంతో పాటు ఉస్మానియాలో కొత్త బిల్డింగ్​ను అందుబాటులోకి తీసుకురావాలి. నిమ్స్​ తరహాలో స్టైయిఫండ్​ పెంచాలి.

Tags:    

Similar News