షాద్ నగర్‌లో కరోనా టెస్టుల కిట్ల కొరత

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 165 కేసులు నమోదు అయినట్లు వైద్య అధికారులు తెలిపారు.ఈ మధ్యకాలంలో నియోజకవర్గంలోని మండలాల పరిధిలో కరోనాకు సంబంధించి వైద్యాధికారులు రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో అధిక సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వైద్య పరీక్షల కిట్ల కొరత ఏర్పడిందని అధికారులు అంటున్నారు. దీంతో స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకునేందుకు ముందుకు వస్తున్నవారు […]

Update: 2020-07-18 03:31 GMT

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 165 కేసులు నమోదు అయినట్లు వైద్య అధికారులు తెలిపారు.ఈ మధ్యకాలంలో నియోజకవర్గంలోని మండలాల పరిధిలో కరోనాకు సంబంధించి వైద్యాధికారులు రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో అధిక సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వైద్య పరీక్షల కిట్ల కొరత ఏర్పడిందని అధికారులు అంటున్నారు. దీంతో స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకునేందుకు ముందుకు వస్తున్నవారు కిట్లు లేక నిరాశ చెందుతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యపరీక్షలు కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలాగే వైద్య పరీక్షలు పెంచితే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అందుకు అనుగుణంగా వైద్య సదుపాయాలు కల్పించాల్సి వస్తుందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News