ట్రంప్ ప్రెస్‌మీట్‌లో కాల్పుల కలకలం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా వైట్‌హౌజ్ ప్రాంగణం వెలుపల కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రెస్‌మీట్‌లో కలకలం రేగింది. ట్రంప్ మాట్లాడుతుండగానే, సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు అతన్ని ప్రెస్‌ మీట్ రూమ్ నుంచి తీసుకెళ్లారు. విలేకరులున్న ప్రెస్ మీట్ రూమ్‌కు వెంటనే తాళం వేశారు. కొన్ని నిమిషాల తర్వాత ప్రెసిడెంట్ మళ్లీ విలేకరుల ముందుకు వచ్చారు. వైట్ హౌజ్ వెలుపల సాయుధుడైన ఓ నిందితుడిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కాల్చారని, వారిని ఆసుపత్రికి […]

Update: 2020-08-11 08:33 GMT

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా వైట్‌హౌజ్ ప్రాంగణం వెలుపల కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రెస్‌మీట్‌లో కలకలం రేగింది. ట్రంప్ మాట్లాడుతుండగానే, సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు అతన్ని ప్రెస్‌ మీట్ రూమ్ నుంచి తీసుకెళ్లారు. విలేకరులున్న ప్రెస్ మీట్ రూమ్‌కు వెంటనే తాళం వేశారు. కొన్ని నిమిషాల తర్వాత ప్రెసిడెంట్ మళ్లీ విలేకరుల ముందుకు వచ్చారు.

వైట్ హౌజ్ వెలుపల సాయుధుడైన ఓ నిందితుడిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కాల్చారని, వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారని ట్రంప్ వివరించారు. ఇతరులెవరూ గాయపడలేదని, ఘటనా వివరాలను అందించాలని యూఎస్ఎస్ఎస్ అధికారులకు ఆయన సూచించారు. వేగంగా స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌లపై ప్రశంసలు కురిపించారు.

Tags:    

Similar News