వైసీపీకి షాక్.. జెడ్పీ చైర్మన్ మల్కిరెడ్డి సుబ్బారెడ్డి రాజీనామా

దిశ, ఏపీ బ్యూరో : కర్నూలు  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి మల్కిరెడ్డి సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలే జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మల్కిరెడ్డి సుబ్బారెడ్డి ఏడాది తిరగకుండానే తన పదవికి రాజీనామా చేసేశారు. రాజీనామాపత్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావుకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు మల్కిరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అయితే జెడ్పీ చైర్మన్‌ పదవి ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి మద్దతున్న కొలిమిగుండ్ల జడ్పీటీసీ ఎర్రబోతుల పాపిరెడ్డికి దక్కే అవకాశం ఉందని […]

Update: 2021-12-18 08:11 GMT

దిశ, ఏపీ బ్యూరో : కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి మల్కిరెడ్డి సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలే జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మల్కిరెడ్డి సుబ్బారెడ్డి ఏడాది తిరగకుండానే తన పదవికి రాజీనామా చేసేశారు. రాజీనామాపత్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావుకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు మల్కిరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అయితే జెడ్పీ చైర్మన్‌ పదవి ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి మద్దతున్న కొలిమిగుండ్ల జడ్పీటీసీ ఎర్రబోతుల పాపిరెడ్డికి దక్కే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. కర్నూలు జిల్లాలో మొత్తం 36 జడ్పీటీసీ స్థానాలకు గాను అన్ని స్థానాల్లో వైసీపీ సభ్యులే విజయం సాధించారు. దీంతో జెడ్పీ చైర్మన్‌గా మల్కిరెడ్డి సుబ్బారెడ్డి ఎంపికయ్యారు. అయితే వైసీపీలో విభేదాలే రాజీనామాకు కారణమని తెలుస్తోంది.

Tags:    

Similar News