వాహనాలు కొనాలనుకునే వారికీ షాక్.. భారీగా పెరగనున్న ధరలు

దిశ, డైనమిక్ బ్యూరో : పండగ వేళ వాహనాలు కొనుగోలు చేసేందకు సిద్ధమైన ప్రజలకు వాహన కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయి. పలు వాహనాలకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్స్​(టీకేఎం)​వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అన్ని సెగ్మెంట్లలోని వాహనాలపై 2 శాతం వరకు ధరలు పెరగనున్నట్లు వెల్లడించింది. ముడి సరకు ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగటం వల్ల.. వాహనాల […]

Update: 2021-09-30 09:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : పండగ వేళ వాహనాలు కొనుగోలు చేసేందకు సిద్ధమైన ప్రజలకు వాహన కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయి. పలు వాహనాలకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్స్​(టీకేఎం)​వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అన్ని సెగ్మెంట్లలోని వాహనాలపై 2 శాతం వరకు ధరలు పెరగనున్నట్లు వెల్లడించింది.

ముడి సరకు ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగటం వల్ల.. వాహనాల ధరల పెంపు తప్పనిసరైందని టొయోటా తెలిపింది. దీనితో పాటు టాటా మోటర్స్ కంపెనీ కూడా మరోసారి ధరలు పెంచేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ధరలు అక్టోబర్ 1 నుంచే అమలులోకి రానున్నాయి.

Tags:    

Similar News