ప్లీజ్ హెల్ప్ చేయండి.. సోనూ సూద్‌కు ‘గబ్బర్’ రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలో పేదల నుంచి సెలబ్రిటీల వరకు సోనూ సూద్ ఆపద్బాంధవుడు అయ్యాడు. లాక్‌డౌన్ కష్టాల నుంచి క్వారంటైన్, వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్ల చికిత్స వరకు సోనూ చేయని సాయం లేదు. సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా.. సాయం కోరి వచ్చిన సెలబ్రిటీలను కూడా సోనూ ఆదుకుంటున్నాడంటే అతడి గొప్పతనమే. ఇటీవల సురైశ్ రైనా బంధువుకు ఆక్సిజన్ అవసరం ఉందని ట్వీట్ చేయగానే.. అందుకు స్పందించిన సోనూ సదరు బాధితుడికి ఆక్సిజన్ అందేలా చొరవ […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలో పేదల నుంచి సెలబ్రిటీల వరకు సోనూ సూద్ ఆపద్బాంధవుడు అయ్యాడు. లాక్‌డౌన్ కష్టాల నుంచి క్వారంటైన్, వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్ల చికిత్స వరకు సోనూ చేయని సాయం లేదు. సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా.. సాయం కోరి వచ్చిన సెలబ్రిటీలను కూడా సోనూ ఆదుకుంటున్నాడంటే అతడి గొప్పతనమే. ఇటీవల సురైశ్ రైనా బంధువుకు ఆక్సిజన్ అవసరం ఉందని ట్వీట్ చేయగానే.. అందుకు స్పందించిన సోనూ సదరు బాధితుడికి ఆక్సిజన్ అందేలా చొరవ చూపిన సంగతి తెలిసిందే.
తాజాగా తనకు కూడా సాయం కావాలంటూ సోనూ సూద్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్(గబ్బర్) ట్వీట్ చేశాడు. ‘నా ఫ్రెండ్ జై కుష్ అత్యవసరంగా యాక్టెమ్రా(టోసిలిజుమాబ్) 800 ఎంజీ కావాలి. తన తల్లికి ఆక్సిజన్ లెవల్స్ 43కు పడిపోయాయి. ఆమెను (హర్యానా) కర్నాల్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ప్లీజ్ హెల్ప్ చేయండి.. నా ఫ్రెండ్ కాంటాక్ట్ నెంబర్ (9999008692)’ అంటూ @SonuSood(సోనూసూద్) @mlkhattar(హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్), @anilvijminister (హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్) స్పందించండి అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్రెండ్ అవుతోంది. శిఖర్ ట్వీట్‌పై ముగ్గురిలో ఎవరు స్పందిస్తారో అన్న అంశంపై నెటిజన్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.