టీఆర్పీల కోసం నా కొడుకును చంపేస్తారా? : సింగర్ ఆవేదన

దిశ, సినిమా : ఓ న్యూస్ చానల్ చేసిన పనికి తను, తన భార్య వెయ్యిసార్లు మరణించామని బాలీవుడ్ సింగర్, యాక్టర్ శేఖర్ సుమన్ బాధపడ్డారు. తన కొడుకు అధ్యాయన్ సుమన్ సూసైడ్ చేసుకున్నాడన్న ఫేక్ న్యూస్‌తో తల్లడిల్లిపోయామని తెలిపారు. అధ్యాయన్ గతంలో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసి ఉండగా.. ఇలాంటి న్యూస్ రావడంతో కుటుంబం మొత్తం నిజమే అనుకుని ఏడ్చేశామన్నారు. అధ్యాయన్ ఢిల్లీలో ఉంటాడని.. తన ఫోన్‌ కూడా ఆ సమయంలో రీచ్ కాకపోవడంతో భయపడిపోయామని […]

Update: 2021-02-22 03:02 GMT

దిశ, సినిమా : ఓ న్యూస్ చానల్ చేసిన పనికి తను, తన భార్య వెయ్యిసార్లు మరణించామని బాలీవుడ్ సింగర్, యాక్టర్ శేఖర్ సుమన్ బాధపడ్డారు. తన కొడుకు అధ్యాయన్ సుమన్ సూసైడ్ చేసుకున్నాడన్న ఫేక్ న్యూస్‌తో తల్లడిల్లిపోయామని తెలిపారు. అధ్యాయన్ గతంలో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసి ఉండగా.. ఇలాంటి న్యూస్ రావడంతో కుటుంబం మొత్తం నిజమే అనుకుని ఏడ్చేశామన్నారు. అధ్యాయన్ ఢిల్లీలో ఉంటాడని.. తన ఫోన్‌ కూడా ఆ సమయంలో రీచ్ కాకపోవడంతో భయపడిపోయామని చెప్పారు. కానీ తనను చూశాక మనసు కుదుటపడిందన్న శేఖర్.. ఇప్పటికే ఓ కొడుకును కోల్పోయిన తాము, మరో కొడుకు పోయాడన్న ఫేక్ న్యూస్ చూసి ఎంత క్షోభ అనుభవించి ఉంటామో అర్థం చేసుకోవాలన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వార్తలు ప్రచురించిన ‘జీ న్యూస్’ చానల్‌ యాజమాన్యంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్పీల కోసం మనుషుల జీవితాలతో ఆడుకోకూడదని.. మీడియా చానల్స్ రియలైజ్ అయ్యేలా పనిష్మెంట్ ఉండాలన్నారు.

సదరు చానల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన శేఖర్ సుమన్.. జీన్యూస్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఐటీ మినిస్టర్ ప్రకాశ్ జవదేకర్‌, హోం మినిస్టర్ అనిల్ దేశ్‌ముఖ్‌లను ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.

Tags:    

Similar News