షాకింగ్: శేఖర్ మాస్టర్‌ను చంపిన గూగుల్

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో శేఖర్ మాస్టర్ అంటే తెలియని వారుండరు. పాపులర్ ‘ఢీ’ డాన్స్ షో 7 సీజన్ నుండి ఇప్పుడు వస్తున్న 13వ సీజన్ వరకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఢీ ఫ్లాట్‌ఫాం ను సరిగ్గా వాడుకున్న శేఖర్.. అగ్రహీరోలకు సైతం వారికి తగినంటు డాన్స్ స్టెప్పులతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అయితే శేఖర్ మాస్టర్ అభిమానులకు గూగుల్ షాకిచ్చింది. అదేటంటే.. గూగుల్ లో మాస్టర్ శేఖర్ అని సర్చ్ చేస్తే.. ఆయన ఫోటోలతో పాటు, […]

Update: 2021-07-21 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో శేఖర్ మాస్టర్ అంటే తెలియని వారుండరు. పాపులర్ ‘ఢీ’ డాన్స్ షో 7 సీజన్ నుండి ఇప్పుడు వస్తున్న 13వ సీజన్ వరకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఢీ ఫ్లాట్‌ఫాం ను సరిగ్గా వాడుకున్న శేఖర్.. అగ్రహీరోలకు సైతం వారికి తగినంటు డాన్స్ స్టెప్పులతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అయితే శేఖర్ మాస్టర్ అభిమానులకు గూగుల్ షాకిచ్చింది. అదేటంటే.. గూగుల్ లో మాస్టర్ శేఖర్ అని సర్చ్ చేస్తే.. ఆయన ఫోటోలతో పాటు, పుట్టిన రోజు, చనిపోయిన రోజు 8 జులై 2003 అని కూడా గూగుల్ చూపించడంతో శేఖర్ అభిమానులు అవాక్కవుతున్నారు.


అసలు విషయం ఏంటంటే.. తమిళం, మళయాళం తో పాటు తెలుగులో చైల్డ్ అర్టిస్టుగా నటించిన శేఖర్ ను అందరూ మాస్టర్ శేఖర్ అని పిలుస్తుండేవారు. ఈ మాస్టర్ శేఖర్ తెలుగులో అక్కా తమ్ముడు సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించిన దివంగత తమిళనాడు సీఎం జయలలితకు తమ్ముడిగా నటించారు. మాస్టర్ శేఖర్ దాదాపు 50కిపై గా చిత్రాల్లో నటించారు. అతను 8 జులై 2003న మరణించారు. అయితే అందరూ మాస్టర్ శేఖర్ అని పిలువడంతో గూగుల్‌లో కూడా మాస్టర్ శేఖర్‌గా తనకు సంబంధించిన వివరాలు ఆప్‌లోడ్ చేశారు. కానీ.. శేఖర్ మాస్టర్ కు సంబంధించిన ఫోటోలు వస్తుండడంతో శేఖర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Follow on Facebook : https://www.facebook.com/Dishacinema

Tags:    

Similar News