కరోనాపై ఫైట్.. శేఖర్ మాస్టర్ స్టెప్స్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా… కరోనా.. కలలోనూ కరోనా వైరస్ గురించి భయమే. ప్రపంచానికి గుబులు పుట్టిస్తున్న కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అయిపోయింది. జీవన, రవాణా వ్యవస్థ స్తంభించి… ఎవరింటికి వారే పరిమతమయ్యారు. కానీ కొందరు మాత్రం ప్రభుత్వం సూచనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాకెందుకు వస్తుందిలే కరోనా అంటూ రూల్స్ అతిక్రమిస్తున్నారు. ఇలాంటి వారి వల్లే కరోనా బాధితుల సంఖ్య పెరిగే అవకాశముండగా… లాక్ డౌన్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి సోషల్ […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా… కరోనా.. కలలోనూ కరోనా వైరస్ గురించి భయమే. ప్రపంచానికి గుబులు పుట్టిస్తున్న కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అయిపోయింది. జీవన, రవాణా వ్యవస్థ స్తంభించి… ఎవరింటికి వారే పరిమతమయ్యారు. కానీ కొందరు మాత్రం ప్రభుత్వం సూచనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాకెందుకు వస్తుందిలే కరోనా అంటూ రూల్స్ అతిక్రమిస్తున్నారు. ఇలాంటి వారి వల్లే కరోనా బాధితుల సంఖ్య పెరిగే అవకాశముండగా… లాక్ డౌన్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి సోషల్ మీడియా వేదికగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు సినీ ప్రముఖులు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సైతం తన పిల్లలతో కలిసి కరోనాపై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.
చౌరస్తా బ్యాండ్ కంపోజ్ చేసిన ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా… కాళ్లు కూడా మొక్కుతా అడుగుబయట పెట్టకురా…’ సాంగ్‌పై డ్యాన్స్ వీడియో షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కోవిడ్ 19 అరికట్టేందుకు సూచనలిస్తూ ఇంతకు ముందు కూడా ఓ వీడియో రిలీజ్ చేశారు శేఖర్ మాస్టర్. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సామాజిక దూరం ప్రాముఖ్యతను చెబుతూ చేసిన వీడియోలకు మంచి రెస్పాన్స్ రాగా… ఆయన ప్రయత్నాన్ని అభినందించారు నెటిజన్లు.