ఎంపీ కోమటిరెడ్డికి షర్మిల పార్టీ ఆఫర్?
దిశ, తెలంగాణ బ్యూరో : భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షర్మిల పార్టీ ఆఫర్ ఇచ్చింది. తమ పార్టీలోకి చేరాలని షర్మిల అనుచరులు పలువురు కోమటిరెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించిన నాటి నుంచి ఆయన గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీలోకి చేర్చుకోవాలని షర్మిల టీం నిర్ణయించినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక అనంతరం తాను గాంధీభవన్ మెట్లు ఎక్కబోనని […]
దిశ, తెలంగాణ బ్యూరో : భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షర్మిల పార్టీ ఆఫర్ ఇచ్చింది. తమ పార్టీలోకి చేరాలని షర్మిల అనుచరులు పలువురు కోమటిరెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించిన నాటి నుంచి ఆయన గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీలోకి చేర్చుకోవాలని షర్మిల టీం నిర్ణయించినట్లు సమాచారం.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక అనంతరం తాను గాంధీభవన్ మెట్లు ఎక్కబోనని ఆయన తేల్చేశారు. హుజూరాబాద్‌లో జరగబోయే ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని ఆయన కొద్ది రోజుల క్రితం సవాల్ విసిరారు. దీంతో కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతారా లేదా పార్టీ మారుతారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. దీంతో ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరతారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే ఆయనకు ఇటీవల షర్మిల పార్టీలోకి చేరాలని లోటస్ పాండ్ నుంచి ఆహ్వానం అందినట్లుగా సమాచారం.
కోమటిరెడ్డి వైఎస్సార్‌కు సన్నిహితంగా మెలిగేవారు కావడంతోనే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వీలైనంత తొందరగా ఆయన్ను పార్టీలోకి లాగాలని షర్మిల టీం ప్లాన్ చేసినప్పటికీ ఆయన చేరాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా చేరికపై ఎలాంటి స్పష్టత రాలేదని లోటస్ పాండ్ వర్గీయులు చెబుతున్నారు. అయితే షర్మిల టీంలోని పలువురు ఆయన చేరిక తప్పనిసరిగా ఉంటుందని, అయితే కొంత ఆలస్యం జరగొచ్చని వారు చెబుతున్నారు.