ఈసీని కలవనున్న షర్మిల.. అందుకేనా ?

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల తెలంగాణ ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‌ను కలవనున్నారు. హుజూరాబాద్ ఎన్నికల నామినేషన్లపై షర్మిల ఫిర్యాదు చేయనున్నారు. అయితే, ఇదివరకే ఉప ఎన్నికలో 200 మంది నిరుద్యోగులతో నామినేషన్ వేయించాలని షర్మిల భావించగా.. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఆవేదన […]

Update: 2021-10-07 03:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల తెలంగాణ ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‌ను కలవనున్నారు. హుజూరాబాద్ ఎన్నికల నామినేషన్లపై షర్మిల ఫిర్యాదు చేయనున్నారు. అయితే, ఇదివరకే ఉప ఎన్నికలో 200 మంది నిరుద్యోగులతో నామినేషన్ వేయించాలని షర్మిల భావించగా.. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News